జియోఫోన్ 3 ఆగష్టు 12న జియో గిగాఫైబర్‌తో పాటే విడుదల కానుంది. ఈ ఫోన్... మీడియాటెక్ చిప్సెట్ కలిగి ఉంటుంది. జియోఫోన్-2ను కేవలం రూ.2,999 ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన జియో... ఇప్పుడు జియోఫోన్ 3తో ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనుందా?
మార్కెట్‌ను షేక్ చేసిన జియో
రిలయన్స్ జియోఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టడుతూనే మొత్తం ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసింది. ఎందుకంటే ఇది 4 జీ వోల్టే సపోర్ట్ సహా సరసమైన టారిఫ్ ప్లాన్లను అందించింది. మరే ఇతర టెల్కో లేదా స్మార్ట్ఫోన్ల తయారీదారులు ఈ పనిచేయలేదు. జియోఫోన్ పుణ్యమా అని, ఫీచర్ ఫోన్ మార్కెట్ గత రెండేళ్లలో వేగంగా అభివృద్ధి చెందింది. కానీ 2019 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో అలా జరగలేదు. ఫీచర్ ఫోన్ విభాగంలో రిలయన్స్ రిటైల్ మార్కెట్ వాటా 28 శాతం తగ్గింది.
ఆకర్షణీయ ఫీచర్లు కావాలి.
జియోఫోన్ 2..... రూ.2,999 ధరలో మార్కెట్లోకి విడుదలైనా వినియోగదారులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. జియో ఒరిజినల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు గడిచింది. వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. మరి జియోఫోన్ 3 ఎటువంటి ఆకర్షణీయ ఫీచర్లతో వస్తుందో చూడాలి.
ఆగష్టు 12న విడుదల
ఒకే కనెక్షన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్ సేవలు అందించడం రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న గిగా ఫైబర్... ఆగస్టు 12 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అదే రోజు జియో ఫోన్-3ని మార్కెట్లోకి తేనుంది రిలయన్స్.
ఇదీ చూడండి: కశ్మీర్ డైరీ: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా