ETV Bharat / business

జియో ఫోన్‌ నెక్ట్స్.. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో.. తక్కువ ధరకే..

JioNext smartphone: గూగుల్​తో జత కట్టి జియో తీసుకొచ్చిన సరికొత్త స్మార్ట్​ఫోన్​ పేరు జియో ఫోన్​ నెక్ట్స్​. దీనిని సంస్థ పూర్తి స్థాయిలో మార్కెట్​లోకి తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆఫ్​లైన్​ స్టోర్​లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో ప్రకటించింది. ఈ ఫోన్​ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

author img

By

Published : Mar 6, 2022, 8:41 PM IST

JioNext smartphone
జియో ఫోన్‌ నెక్స్ట్‌

JioNext smartphone: భారతీయ టెలికాం దిగ్జజం జియో సంస్థ గూగుల్‌తో కలిసి తీసుకొచ్చిన జియో ఫోన్‌ నెక్స్ట్‌ ఎట్టకేలకు మార్కెట్లోకి పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. గతేడాది దీపావళికి విడుదలైన ఈ మొబైల్‌ను ఇక మీదట రిలయన్స్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. సామాన్యుడి దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్‌లతో జియో ఈ మొబైల్‌ను అభివృద్ధి చేసింది.

5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ స్క్రీన్‌తో వచ్చే ఈ పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్‌.. 2జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌ ప్రాసెసర్‌, వెనుకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్‌ కెమెరాల, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులోని మరిన్ని ప్రత్యేకతలు. వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్ట్స్‌, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ మొబైల్‌ సరికొత్త 'ప్రగతి ఓఎస్‌' పై రన్‌ అవ్వడం విశేషం. ప్రీలోడెడ్ జియో, గూగుల్ యాప్‌లు ఉంటాయి. బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక జియోఫోన్ నెక్స్ట్‌ ధరను కంపెనీ రూ.6,499గా నిర్ణయించింది.

ఇదీ చూడండి:

అద్భుతమైన ఫీచర్స్​తో స్మార్ట్​ఫోన్స్​.. వీటిపై ఓ లుక్కేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.