ETV Bharat / business

వెబ్‌ కెమెరా లేకుండానే టీవీలో వీడియోకాల్స్‌! - జియో జాయిన్ యాప్ సెట్టింగ్స్

'కెమెరా ఆన్‌ మొబైల్‌' పేరుతో జియో ఫైబర్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీనితో వెబ్‌ కెమెరా అవసరం లేకుండానే మొబైల్ ఫోన్​ నుంచే టీవీలో వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించింది.

jio
జియో
author img

By

Published : Aug 4, 2021, 5:13 AM IST

జియో ఫైబర్‌ యూజర్స్‌కి మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌ కెమెరా అవసరం లేకుండా యూజర్స్ తమ మొబైల్ ఫోన్ సాయంతో టీవీలో వీడియో కాల్స్ మాట్లాడుకునేలా 'కెమెరా ఆన్‌ మొబైల్‌' పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్‌ జియో జాయిన్ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉందని తెలిపింది.

జియో ఫైబర్ సర్వీసుల్లో భాగంగా జియో ఫైబర్‌ వాయిస్‌ సేవల ద్వారా ఈ వీడియో కాలింగ్ ఫీచర్‌ను బ్రాడ్‌బాండ్ యూజర్స్‌కి అందిస్తున్నారు. అలాగే, జియో ఫైబర్‌ వినియోగదారులు జియో జాయిన్‌ యాప్‌లో ల్యాండ్‌లైన్ నంబర్‌ ఎంటర్ చేసి వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

కెమెరా ఆన్ మొబైల్..

ఈ వీడియో కాలింగ్ ఫీచర్‌ కోసం యూజర్స్ ముందుగా తమ పది అంకెల జియో నంబర్‌ని జియో జాయిన్ యాప్‌లో ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ మొబైల్‌ వర్చువల్‌గా టీవీకి కనెక్ట్ అవుతుంది. తర్వాత జియో జాయిన్ యాప్‌ సెట్టింగ్స్‌లో 'కెమెరా ఆన్‌ మొబైల్' ఫీచర్ ఎనేబుల్ చేసి టీవీ నుంచి వీడియో కాలింగ్ సేవలను ఎంజాయ్ చెయ్యొచ్చు.

అదైతే మేలు..

ఈ ఫీచర్ ద్వారా మెరుగైన వీడియో కాలింగ్ సేవలను ఆస్వాదించాలంటే 5 గిగా హెడ్జ్‌ సామర్థ్యం కలిగిన వైఫై మోడెమ్‌ ఉపయోగించడం మేలని జియో ఫైబర్ సూచిస్తుంది. 2.4 గిగాహెడ్జ్‌ సామర్థ్యంతో కూడా వీడియో కాలింగ్ సేవలను ఆస్వాదించవచ్చని తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.