ETV Bharat / business

Amazon: సీఈఓగా జులై 5న తప్పుకోనున్న బెజోస్ - అమెజాన్ నూతన సీఈఓ

అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్(jeff bezos) జులై 5న తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ అధిపతిగా ఉన్న ఆండీ జాస్సీ అదే రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని బెజోస్ స్వయంగా ప్రకటించారు.

Jeff Bezos
జెఫ్ బెజోస్
author img

By

Published : May 27, 2021, 8:17 AM IST

Updated : May 27, 2021, 12:01 PM IST

ప్రముఖ ఈ కామర్స్​ కంపెనీ 'అమెజాన్' (amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) సీఈఓ పదవి నుంచి తప్పుకునే తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన బెజోస్.. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ అధిపతిగా ఉన్న ఆండీ జాస్సీ(andy jassy) జులై 5న సీఈఓ పదవిని చేపట్టనున్నట్లు తెలిపారు.

బుధవారం అమెజాన్(amazon) వాటాదారుల సమావేశం జరిగింది. 1994లో సంస్థను స్థాపించిన జులై 5 తనకు సెంటిమెంట్ అని అందుకే ఆ తేదీని ఎంచుకున్నట్లు బెజోస్(jeff bezos) వెల్లడించారు. సీఈఓ పదవి నుంచి బెజోస్ తప్పుకోనునున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమెజాన్ కార్పొరేషన్ ప్రకటించింది.

ఎగ్జిక్యూటివ్​ ఛైర్​పర్సన్​గా కొనసాగింపు..

పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. అమెజాన్​ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్​గా బెజోస్ కొనసాగుతారు. నూతన ఉత్పత్తులు సహా.. అంతరిక్ష సంస్థ 'బ్లూ ఆరిజిన్', ప్రముఖ వార్తాపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ఇతర వ్యాపారాలపైనా దృష్టి సారించనున్నారు.

ఇప్పటికే వీడియో స్ట్రీమింగ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు.. 8.45 బిలియన్​ డాలర్లతో ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ఎంజీఎంను(MGM STUDIOS) కొనుగోలు చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

ఇవీ చదవండి: అమెజాన్​ ప్రైమ్ నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్‌ లేనట్లే!

ఇకపై ఎమ్​జీఎమ్​ స్టూడియో అమెజాన్ సొంతం

Last Updated : May 27, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.