ETV Bharat / business

కరోనా నివారణకు ఐటీసీ నాజల్ స్ప్రే! - కరోనా నివారణకు ఐటీసీ ఔషధం

కొవిడ్​ నివారణకు నాజల్​ స్ప్రేని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది దిగ్గజ కార్పొరేట్​ కంపెనీ ఐటీసీ. క్లినికల్​ ట్రయల్స్​ కూడా ప్రారంభమైనట్లు వెల్లడించింది.

itc nasal spray for covid
కరోనాకు ఐటీసీ నాజల్​ స్ప్రే
author img

By

Published : Nov 25, 2021, 2:40 PM IST

కరోనా నివారణకు నాజల్​ స్ప్రేని(nasal spray for covid prevention) అభివృద్ధి చేస్తున్నట్లు దేశీయ కార్పొరేట్​ దిగ్గజం ఐటీసీ ప్రకటించింది. స్ప్రే కోసం క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభించినట్లు పేర్కొంది. బెంగుళూరులోని ఐటీసీకి(itc news latest) చెందిన లైఫ్​ సైన్స్​స్ అండ్​ టెక్నాలజీ సెంటర్​(ఎల్​ఎస్​టీసీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. ముక్కులోకి ప్రవేశించే ప్రదేశంలో వైరస్‌ను అడ్డుకునేలా ఈ స్ప్రేను తయారు చేశారు. అన్ని సజావుగా జరిగితే.. అనుమతులు పొందిన తర్వాత దీనిని 'సావ్లాన్​ బ్రాండ్' పేరుతో మార్కెట్​లోకి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

క్లినికల్​ ట్రయల్స్ కోసం నైతిక​ కమిటీల నుంచి అనుమతులు పొందినట్లు వెల్లడించాయి. ఈ మేరకు క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ-ఇండియాలో(సీటీఆర్​ఐ) నమోదైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే క్లినికల్ ట్రయల్ ఎక్కడ జరుగుతున్నాయి? ఆమోదం తర్వాత ఉత్పత్తి ఎక్కడ చేస్తారు? అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు చెప్పలేమని సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

కొవిడ్​-19 వ్యాప్తిని నివారించడంలో ఈ స్ప్రే సమర్థంగా పని చేస్తుందని తెలిపారు. అయితే స్ప్రేతో పాటు ఇతర కొవిడ్ నిబంధనలు కూడా పాటించాలన్నారు.

ఇదీ చూడండి: శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.