Iphone se 2022:భారత్‌లో యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ ధర గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 8న జరగనున్న కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్ ఎస్‌ఈ 5జీ మోడల్‌ను యాపిల్ విడుదల చేయొచ్చని, ఈ సందర్భంగా ఐఫోన్ ఎస్‌ఈ ధరను భారీగా తగ్గించొచ్చని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఐఫోన్ ఎస్‌ఈ2020 ధర 199 డాలర్లు (దాదాపు రూ.15000)కు తగ్గొచ్చని చెబుతున్నారు.
భారత్‌లో విడుదలైనప్పుడు ఐఫోన్ ఎస్‌ఈ 2020 ధరను రూ.42,500గా నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల్లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.26,999కు లభిస్తోంది. తాజా వార్తలు నిజమైతే భారత్‌లో మరింత మంది కొనుగోలుదార్లను యాపిల్ ఆకట్టుకునే అవకాశం ఉంది. గత కొన్నేళ్లలో భారత్ విక్రయాల్లో కంపెనీ గణనీయ వృద్ధి సాధించినా, ఇది ప్రీమియం విభాగానికే పరిమితమైంది.
2021 డిసెంబరు త్రైమాసికంలో ఏడాదిక్రితంతో పోలిస్తే 34%అధికంగా యాపిల్ 23 లక్షల మొబైళ్లు విక్రయించింది. భారత్‌లో కంపెనీకి ఇదే అత్యుత్తమ త్రైమాసికం. రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేసినప్పటికీ.. భార త విపణిలో యాపిల్ వాటా 5 శాతం లోపే ఉంది. రూ.20000లోపు ఐఫోన్ మోడల్‌ను తీసుకొస్తే కంపెనీ మరిందరు కొనుగోలుదార్లను చేరుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: