ETV Bharat / business

బీమా సొమ్ము పొందాలంటే ఇంత కష్టపడాలా..? - బీమా

బీమా సొమ్ము పొందాలంటే వినియోగదారుడు ఆ సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని దిల్లీ వినియోగదారుల కమిషన్​ వ్యాఖ్యానించింది. నిరక్షర్యాసులు బీమా దరఖాస్తులోని నిబంధనలను ఎలా చదువుతారని ప్రశ్నించింది.

బీమా సొమ్ము
author img

By

Published : Mar 21, 2019, 6:30 AM IST

బీమా సంస్థల నుంచి ఇన్స్యూరెన్స్​ సొమ్ము పొందటానికి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దిల్లీ వినియోగదారుల కమిషన్​ వ్యాఖ్యానించింది. నిరక్షరాస్యులు బీమా దరఖాస్తు ఫారంపై సంతకం చేసేటప్పుడు అందులోని నిబంధనలను ఎలా చదువుతారని వినియోగదారుల కమిషన్​ ప్రశ్నించింది. చాలా సందర్భాల్లో బీమా పొందేందుకు నిబంధనలు అడ్డుపడుతున్నాయని పేర్కొంది.

ఉహించని పరిస్థితుల్లో వైద్యం పొందడం కోసమే ఆరోగ్య బీమాను తీసుకుంటారు. బీమా పొందే సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే, ఆ వినియోగదారునికి కచ్చితంగా బీమా సొమ్ము చెల్లించాలి. - దిల్లీ వినియోగదారుల కమిషన్.​

దిల్లీ ఫరీదాబాద్​కు చెందిన ప్రతాప్​ సింగ్​ ఓ ప్రయివేటు బీమా సంస్థలో 2008వ సంవత్సరంలో 50 లక్షల రూపాయల పాలసీని తీసుకున్నాడు. ఈ బీమా కాలపరిమితి 20 సంవత్సరాలు . దీనికి ఆయన సోదరుడు విర్​పాల్​ నగర్​ను నామినీగా పెట్టాడు.

2009లో ప్రతాప్​సింగ్​ మరణంతో అతని సోదరుడు విర్​పాల్​ బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2010లో బీమా సంస్థ ఆయన వినతిని తిరస్కరించింది.

ప్రతాప్​ సింగ్​కు అంతకు ముందే ఆస్తమా, పక్షవాతం ఉన్నాయని... వీటిని దరఖాస్తులో ప్రస్తావించనందుకే తిరస్కరించామని సంస్థ తెలిపింది. దీంతో విర్​పాల్​ నగార్​ వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు.

బీమా తిరస్కరణకు సంస్థ తెలిపిన కారణాలు సరిగా లేవని వినియోగ దారుల కమిషన్​ సభ్యుడు అనిల్​ శ్రీవాస్తవ తెలిపారు. రెండు నెలలలోపు తిరిగి బీమా సొమ్ము పొందేందుకు దరఖాస్తు చేసుకునేలా విర్​పాల్​కు అవకాశం కల్పించాలని సంస్థను ఆదేశించింది.

ఇంతకుముందెప్పుడూ చికిత్స తీసుకోకుండా, శస్త్ర చికిత్స తీసుకోకపోతే అది ముందు నుంచి ఉన్న వ్యాధుల కిందకి రాదని గతంలో ఇచ్చిన ఆదేశాలను కమిషన్​ గుర్తు చేసింది.

ఏదైనా అనారోగ్యం ఉన్నప్పటికీ చికిత్స తీసుకోకపోయినా, ఆసుపత్రిలో చేరకపోయినా అది ముందు నుంచే ఉన్న రోగంగా పరిగణించకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను కమిషన్​ గుర్తుచేసింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.