మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) ఆగస్టులో 1.1 శాతం క్షీణించింది. 2018లో ఇదే సమయంలో ఐఐపీ వృద్ధి 4.8 శాతంగా ఉంది.
ఐఐపీకి 77 శాతానికిపైగా సహకారం అందించే ఉత్పాదకరంగం.. 2019 ఆగస్టులో 1.2 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో ఉత్పాదక రంగం 5.2 శాతం వృద్ధిని నమోదుచేసింది. విద్యుత్ ఉత్పత్తి గతేడాది 7.6 శాతం ఉండగా, ఈ సంవత్సరం 0.9 శాతానికి క్షీణించింది. అయితే మైనింగ్ రంగంలో 0.1 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తంగా చూసుకుంటే గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య ఐఐపీ వృద్ధి 5.3 శాతంగా ఉండగా, 2019లో అది 2.4 శాతానికి పడిపోయింది.
ఇదీ చూడండి: జానపద నృత్యాల మధ్య జిన్పింగ్ ప్రయాణం