అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, బ్రిటన్‌లో ఆక్స్ఫర్డ్ టీకాకు అనుమతుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ- సెన్సెక్స్ 133 పాయింట్లు వృద్ధి చెంది 47,746 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ నిప్టీ 49 పాయింట్ల పెరిగి 13,981 వద్ద స్థిరపడింది.
ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రా డేలో మందకొండిగా సాగాయి. చివరకు మళ్లీ పుంజుకుని లాభాల బాట పట్టాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, యూపీఎల్, బబాజ్ ఫైనాన్స్ షేర్లు వృద్ధి సాధించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.