ETV Bharat / business

సంపన్నుల ఓటు 'షేర్​ మార్కెట్'​కే..

స్థిరాస్తి నుంచి స్టాక్‌ మార్కెట్లోకి పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని రానున్న మూడేళ్లలో ఈ పెట్టుబడులు మరింత పెరగనున్నాయని హురున్ ఇండియా సర్వేలో తేలింది. అత్యధిక మిలియనీర్లు ఉన్న కుటుంబాల్లో ముంబయి టాప్​లో నిలిచిందని స్పష్టం చేసింది.

India's wealthy to allocate more to stocks over next three years says survey
సంపన్నుల ఓటు షేర్​ మార్కెట్​కే
author img

By

Published : Mar 17, 2021, 7:51 AM IST

సంపన్నులు, అధిక ఆదాయం ఉన్నవారు పెట్టుబడుల కోసం షేర్లనే ఎంచుకుంటున్నట్లు హురున్‌ ఇండియా సర్వేలో తేలింది. రాబోయే మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్లో వీరి పెట్టుబడులు మరింత పెరగనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు స్థిరాస్తిలో ఉన్న పెట్టుబడులను క్రమంగా తగ్గించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

దేశంలో రూ.10 కోట్ల నికర సంపద ఉన్న కుటుంబాలు 3 లక్షలు, రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న సంపద కుటుంబాలు 23,000 ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇందులో 10 లక్షల డాలర్లకన్నా అధిక విలువ ఉన్న వ్యక్తుల్లో 442 మందిని హురున్‌ ఇండియా ఈ సర్వే కోసం ఎంపిక చేసింది. రానున్న మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్లో నమోదైన షేర్లలో తమ పెట్టుబడులు పెంచుకునేందుకు వీరిలో 35శాతం ఆసక్తి చూపించారు. దాదాపు 27శాతం మందికి అధిక పెట్టుబడులు స్థిరాస్తుల్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో పెట్టుబడులను స్థిరాస్తి నుంచి షేర్లలోకి మార్చుకుంటామని వీరు పేర్కొన్నారు.

'ఈ సర్వేను మేము గత ఏడాది మొత్తం నిర్వహించాం. కొవిడ్‌ నేపథ్యంలో మార్కెట్లు తగ్గినా.. చాలామంది షేర్లు కొనేందుకే ఇష్టపడ్డారు.. స్థిరాస్తితో పోలిస్తే.. ఈక్విటీల్లో పెట్టుబడులకే ఇప్పుడు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమవుతోంది' అని హురున్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.

  • భారత్‌లోని అధిక సంపన్నులు అమెరికా (26.6శాతం), సింగపూర్‌ (11.6%), యూఏఈ (10%), యూకే (6.6%) దేశాల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం చాలామంది తమ పిల్లలను అమెరికా (56.9%), యూకే (19%), కెనడా (8.6%) దేశాలకు పంపిస్తున్నారు.
  • ఎక్కువ మంది సంపన్నులు మెర్సిడెజ్‌ బెంజ్‌ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
  • సంపన్నులు బీమా కోసం ఎక్కువగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)నే నమ్ముతున్నారు. దాదాపు 39% మంది ఇందులో పాలసీలు తీసుకోగా... హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 17%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో 13.6% మంది బీమా తీసుకున్నారు.

మిలియనీర్‌ కుటుంబాలు

దేశంలో 10 లక్షల డాలర్ల (మిలియనీర్‌- సుమారు రూ.7.3 కోట్ల)కు పైగా నికర విలువ కలిగిన కుటుంబాలు 4.12 లక్షలున్నాయని హురున్‌ ఇండియా వెల్లడించింది. వేగంగా సంపద సృష్టిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటని, ఏటా బిలియనీర్ల (100 కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగినవారు) సంఖ్యను జత చేయడంలో భారత్‌ మూడో స్థానంలో ఉందని హురున్‌ నివేదిక స్పష్టం చేసింది.

'తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.7.3 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన కుటుంబాలు 20,000 ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి కుటుంబాలు 18,000 ఉన్నాయి' అని తెలిపింది.

India's wealthy to allocate more to stocks over next three years says survey
తొలి పది రాష్ట్రాల్లోని ధనికుల కుటుంబాలు

నగరాల్లో ముంబయి టాప్‌: ముంబయిలో అత్యధికంగా 16,933 మిలియనీర్‌ కుటుంబాలు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో దిల్లీ(15,861), కోల్‌కతా(24,00), బెంగళూరు(7582), చెన్నై(4685) ఉన్నాయి.

ఇదీ చదవండి:అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా- 'ఆక్యుజెన్‌ ఇంక్' సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.