కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్తో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల 24 నాటికి ముగిసిన వారాంతంతో దేశంలో నిరుద్యోగ రేటు 24.3శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. అంతకు ముందు వారాంతంలో నిరుద్యోగ రేటు 24శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
మార్చి నెల చివరి వారం నుంచి దేశంలో లాక్డౌన్లో ఉంది. అయితే గడిచిన ఎనిమిది వారాల్లో నమోదైన సగటు నిరుద్యోగ రేటు 24. శాతం కన్నా.. ఈ సారి నిరుద్యోగం ఎక్కువైనట్లు నివేదిక ద్వారా తేలింది.
లాక్డౌన్ కారణంగా ఆదాయం క్షీణించి.. చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.
కార్మిక భాగస్వామ్య రేటు..
మే 24తో ముగిసిన వారాంతానికి కార్మిక భాగస్వామ్య రేటు మళ్లీ 38.7 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది. అంతకు ముందు వారాంతంలో ఇది 38.8శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అప్పటి వరకు వరుసగా మూడు వారాలు కార్మిక భాగస్వామ్య రేటు పెరుగుతూ వచ్చిన విషయాన్ని నివేదిక గుర్తుచేసింది.
ఇదీ చూడండి:భారత్లో 37శాతం మంది బంగారం అసలే కొనలేదంట!