Jio subscribers in india: డిసెంబర్ నెలతో పోల్చితే భారత్లో మొబైల్ చందాదారుల సంఖ్య భారీగా తగ్గింది. సుమారు 1.28కోట్ల మేర వినియోగదారులను టెలికాం సంస్థలు కోల్పోయినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాను వీడినట్లు పేర్కొంది. మరోవైపు భారతీ ఎయిర్టెల్ తన వినియోదారుల సంఖ్యను పెంచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రాయ్ గణాకాలను విడుదల చేసింది.
ట్రాయ్ గణాకాల ప్రకారం రిలయన్స్ జియో సుమారు 1.29 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ప్రస్తుతం మొత్తం జియో చందాదారుల సంఖ్య 41.57 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది ట్రాయ్. మరోవైపు వొడాఫోన్ ఐడియాను 16.14 లక్షల మంది వీడారు. ప్రస్తుతం చందాదారులు సంఖ్య 26.55 కోట్లు ఉన్నట్లు ట్రాయ్ గణాంకాలు చెప్తున్నాయి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ కూడా క్రమంగా తన చందాదారుల సంఖ్యను సమారు 11 లక్షల వరకు పెంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ టారిఫ్లను భారీగా పెంచిన నేపథ్యంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్ వైపు అడుగులు వేసినట్లు వివరించింది.
ఇదే సమయంలో ఎయిర్టెల్ ఏకంగా 4.75 లక్షల మంది చందాదారులను రాబట్టుకోగలిగింది. దీంతో మొత్తం వినియోగదారులు సంఖ్య 35.57 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి: Air India: 'ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎయిర్ఇండియా'