దేశంలో కరోనా కారణంగా అనేక రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్లు, పాక్షిక లాక్‌డౌన్లు అమలులో ఉన్నాయి. ఈ కారణంగా ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ 9.4 శాతం తగ్గింది.
మార్చిలో 18.77 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం జరగ్గా ఏప్రిల్‌లో అది 17.01 మిలియన్ టన్నులకు పడిపోయింది.
ఏప్రిల్‌లో పెట్రోల్ అమ్మకాలు (మార్చితో పోలిస్తే) 13 శాతం, డీజిల్ అమ్మకాలు 7.5 శాతం తగ్గాయి. ఏటీఎఫ్ (విమానాల్లో వాడే ఇంధనం) అమ్మకాలు కూడా గత నెల 14 శాతం పడిపోయాయి. వంట గ్యాస్ విక్రయాలు 2.1 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. మార్చితో ఈ విక్రయాలు 6.4 శాతం తక్కువ.
ఇదీ చదవండి: