ETV Bharat / business

'ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందేది భారత ఆర్థిక వ్యవస్థే' - భారత ఆర్థిక వ్యవస్థ

Indian Economy News: 2022-23 బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాల కారణంగా భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నెలవారీ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

indian economy news
భారత ఆర్థిక వ్యవస్థ
author img

By

Published : Feb 16, 2022, 10:44 PM IST

Indian Economy News: బడ్జెట్‌ 2022-23లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందుకున్న తయారీ, నిర్మాణ రంగాలు అందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.

వ్యవసాయ రంగానికి వస్తే సాగు విస్తీర్ణంలో పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. బహుళ పంటల సాగు సైతం పుంజుకుందని పేర్కొంది. అలాగే భారీ ఎత్తున కొనుగోలు, పీఎం కిసాన్‌ సహా కనీస మద్దతు ధర వంటి ప్రభుత్వ చర్యల వల్ల రైతులు సైతం లాభపడనున్నారని నివేదిక అభిప్రాయపడింది.

2022కి గానూ ఒక్క భారత్‌ తప్ప ప్రపంచ దేశాల వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించిందని గుర్తుచేసింది. గత బడ్జెట్‌ల ద్వారా నిర్దేశించిన మార్గాలను తాజా బడ్జెట్‌ మరింత బలపరచనుందని తెలిపింది.

కొవిడ్‌ మూడో దశలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడగలిగిందని నివేదిక తెలిపింది. విద్యుత్తు వినియోగం, తయారీ కార్యకలాపాలు, ఎగుమతులు, ఈ-వే బిల్లుల జనరేషన్‌ వంటి అంశాల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది.

కొవిడ్‌-19 వల్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయని.. డిమాండ్‌ పుంజుకుంటుందని వెల్లడించింది. తద్వారా ప్రైవేటు పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి గాడిలో పడుతుందని వివరించింది.

ఇదీ చూడండి: ఎల్‌ఐసీ వద్ద భారీగా క్లెయిం చేయని నిధులు- 20 వేల కోట్లకుపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.