ETV Bharat / business

'2021-22లో భారత వృద్ధి రేటు 9.2 శాతం!' - సవరించిన భారత వృద్ధి రేటు

India GDP Growth 2021-22: దేశ జీడీపీ వృద్ధిరేటు 2021-22లో 9.2 శాతం ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3శాతం క్షీణించగా, ఈ సారి మాత్రం వృద్ధి నమోదవుతుందని తెలిపింది.

Indian economy estimated to grow
'2021-22లో భారత వృద్ధి రేటు 9.2 శాతం!'
author img

By

Published : Jan 7, 2022, 5:57 PM IST

Updated : Jan 7, 2022, 6:40 PM IST

India GDP Growth rate 2021-22: భారత ఆర్థిక వ్యవస్థ 2021-22లో 9.2 శాతం వృద్ధి చెందొచ్చని కేంద్రం అంచనా వేసింది. ప్రధానంగా వ్యవసాయం, గనులు తయారీ రంగాలు మెరుగైన పనితీరును కనపరుస్తుండడం కారణంగా అంచనాను పెంచినట్లు జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించింది. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3శాతం క్షీణించగా, ఈ సారి మాత్రం వృద్ధి నమోదవుతుందని తెలిపింది.

2021-22లో జాతీయ ఆదాయంపై గణాంక కార్యాలయం తొలి ముందస్తు అంచనాలు విడుదల చేసింది. ప్రస్తుత వృద్ధి రేటు అంచనా కొవిడ్​కు ముందు ఉన్న దాని కంటే ఎక్కువ కావడం గమనార్హం.

గతేడాది రూ.124.53 లక్షల కోట్లుగా ఉన్న జీవీఏ ఈ ఏడాది రూ.135.22 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం పేర్కొంది. ఏడాది చివరకు కొవిడ్​కు ముందున్న రూ.145.69 లక్షల కోట్ల మార్కును కూడా అధిగమిస్తుందని తెలిపింది. దీని ప్రకారం వృద్ధి సుమారు 8.6 శాతం పెరిగినట్లు అంచనా వేసింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి మార్చి 2020లో భారత్​లో ప్రారంభమైంది. ఫలితంగా అదే నెల 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిపై భారీగా దెబ్బపడింది. 2020-21లో జీడీపీ 7.3 శాతం క్షీణించింది.

ఇదీ చూడండి: క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ- డుంజోలో 25.8% వాటా సొంతం

Last Updated : Jan 7, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.