ETV Bharat / business

'వచ్చే అయిదేళ్లలో వంద కోట్ల మొబైల్​ ఫోన్లు'

వచ్చే అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా వంద కోట్ల మొబైల్​ ఫోన్లను తయారు చేయడంమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని సంకల్పించుకున్నామని వెల్లడించారు.

India to produce 100 cr mobile phones, 5 cr laptops in 5 years: Prasad
'వచ్చే అయిదేళ్లలో వంద కోట్ల మొబైల్​ ఫోన్లు'
author img

By

Published : Dec 16, 2020, 5:35 AM IST

దేశంలో వచ్చే అయిదేళ్లలో వంద కోట్ల మొబైల్‌ ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో అయిదు కోట్ల టెలివిజన్‌ సెట్లు, లాప్‌టాప్‌ల చొప్పున తయారు చేయాలని కూడా నిర్ణయించినట్లు సీఐఐ సదస్సులో వెల్లడించారు.

దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్‌ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో లాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ తయారీలో ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఒక శాతం వాటా 26శాతానికి పెరగనుందని అన్నారు. దీని ద్వారా 5లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

లాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ తయారీ రంగంలో 2025 నాటికి ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని, విదేశీ మారక నిల్వలు 75 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి:'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.