ETV Bharat / business

డిసెంబర్​ కల్లా 10 కోట్ల వ్యాక్సిన్​ డోసులు

వచ్చే నెల కల్లా భారత్​కు 10 కోట్ల కరోనా వ్యాక్సిన్​ డోసులు అందజేయగలమని స్పష్టం చేశారు సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా. ఈ నేపథ్యంలో డిసెంబర్​లో టీకా పంపిణీకి అనువుగా కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

India to get 10 crore doses of Oxford vaccine next month, says Serum Institute CEO
డిసెంబర్​ కల్లా 10 కోట్ల వ్యాక్సిన్​ డోసులు
author img

By

Published : Nov 14, 2020, 5:35 AM IST

డిసెంబర్‌ కల్లా భారత్‌కు పది కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను అందజేయగలమని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా ప్రకటించారు. దీంతో దేశ ప్రజలకు అదే నెలలో ఆస్ట్రాజెనెకా టీకాలు వేసేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రాజెనెకా చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే.. భారత్‌కు టీకాను పంపిణీ చేసేందుకు ఎస్‌ఐఐ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అనువుగా కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు లభించగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సంస్థ సీఈఓ. ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి వచ్చే ఏడాది పూర్తి స్థాయి అనుమతులు లభిస్తే, 50:50 శాతం నిష్పత్తిలో దక్షిణాసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేయనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకు నేతృత్వం వహించనుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఐదు సంస్థలతో ఇప్పటికే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గత రెండు నెలల్లో ఆస్ట్రాజెనెకా టీకాను 4 కోట్ల డోసులు ఉత్పత్తి చేసింది కూడా. నోవావ్యాక్స్‌ అభివృద్ధి చేస్తున్న టీకా ఉత్పత్తిని కూడా త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటోంది. ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, నోవావ్యాక్స్‌ టీకాలు రెండూ సమర్థంగా పనిచేసేలా కన్పిస్తున్నాయని పూనావాలా పేర్కొన్నారు. ఇవి రిఫ్రిజరేటర్‌ ఉష్ణోగ్రతల్లోనూ నిల్వ చేసి, సరఫరా చేయొచ్చని తెలిపారు.

అదే సవాలు..

సాధ్యమైనంత వరకు డిసెంబరు కల్లా భారీగా టీకా డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తం అవుతున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ వెల్లడించారు. బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతులు లభిస్తే.. ఆ వివరాలనే భారత్‌ ప్రభుత్వానికి కూడా సమర్పిస్తామని పేర్కొన్నారు. అయితే ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ఎంత మేర సమర్థంగా పనిచేస్తుందనే విషయం ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షల్లో తేలాల్సి ఉంది. టీకా సమర్థంగా పనిచేస్తుందని రుజువై, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించినప్పటికీ సువిశాల దేశం మొత్తానికి సాధ్యమైనంత త్వరగా, సులువైన పద్ధతుల్లో టీకా పంపిణీ ఎలా చేయాలనే అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయడం పూర్తి కావాలంటే 2024 వరకు సమయం పట్టే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లకు గానీ వైరస్‌ను ఏమాత్రం నియంత్రించామనే విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ధరపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో భారత్‌ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ల పంపిణీకి భారత్‌ ప్రభుత్వానికి రూ.80,000 కోట్లు అవసరం అవుతాయని సెప్టెంబరులో పూనావాలా తెలిపారు. అయితే భారత్‌ ప్రభుత్వ మాత్రం గత నెలలో సుమారు రూ.50,000 కోట్లు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

ఇదీ చూడండి: మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.