దేశంలోకి విదేశీ సంస్థలను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, ఒప్పందాలను అమలు చేసే యంత్రాంగాన్ని మెరుగుపరచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చైనాలోని కొన్ని సంస్థలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని.. ఇతర దేశాల్లో కంపెనీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి!
'కరోనా వల్ల భారత్‌కు అద్భుత అవకాశాలు వస్తున్నాయి. కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. విదేశీ సంస్థలు దేశంలోకి వచ్చినట్లయితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సంపద పెరుగుతుంది. 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యం నెరవేరుతుంది. ప్రపంచ దేశాలు చైనా ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడుతున్నాయి. చైనాలో వైరస్ ఉద్భవించడం వల్ల ప్రస్తుతం వాటికి డిమాండ్ తగ్గింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషిస్తున్నాయి' అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
"శ్రామికుల కనీస వ్యయాన్ని ఆధారంగా చేసుకొని, నెమ్మదిగా కార్పొరేట్ పన్నులు తగ్గించి.. సంస్థలకు ఉపశమనం కల్పిస్తే భవిష్యత్‌లో భారత్ గొప్ప తయారీ కేంద్రంగా అవతరిస్తుంది." -అతుల్ పాండ్యా, ఆర్థిక నిపుణులు
తగిన చర్యలు తీసుకోవాలి!
"విదేశీ సంస్థలను ఆహ్వానించడానికి, చైనాకు ప్రత్యమ్నాయ తయారీదారుగా అవతరించడానికి.. భారత్ ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోవాలి. విదేశీ మారక సంబంధిత చట్టాలు, ప్రత్యేక వాణిజ్య న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. వ్యాపార ఒప్పందాల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి. దాంతో పాటు స్టాంప్ డ్యూటీలు, ఇతర వ్యయాలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి" అని ప్రభుత్వానికి సూచించారు పాండ్యా.
ఆంక్షలు వల్లే..
'వైరస్ వల్ల విధించే ఆంక్షల కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా స్థానిక సంస్థలకు దేశీయ అవసరాలను తీర్చే అవకాశం వచ్చింది. దీంతో పాటు విదేశీయ కంపెనీలు ఆకర్షించడానికి మంచి అవకాశం లభించింది. ప్రత్యేకంగా చైనాలో వ్యాపారాలను మూసివేయాలనుకొనే వారికి, గొప్ప పెట్టుబడులకు భారత్ అనువైన స్థానంగా కనిపిస్తోంది.' అని డైజీ చావ్లా అనే ఆర్థిక నిపుణురాలు పేర్కొన్నారు.
"భారత్ తదుపరి ఉత్పత్తి కేంద్రంగా అవతరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద అంతర్గత మార్కెట్‌ను, నాణ్యమైన శ్రామిక శక్తి తక్కువ ధరకే లభిస్తుంది. ప్రైవేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలో వాణిజ్యం, ఎఫ్‌డీఐ విధానాలను సమన్వయం చేయడంపై దృష్టి పెడితే భారత్ తన పోటీతత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు." -మహ్మద్ అథర్, పీడబ్ల్యూసీ సంస్థ ప్రతినిధి
ఇదీ చూడండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఉద్యోగాల కోసం భారతీయుల వేట