ETV Bharat / business

'ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి'

దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి(Covid Third wave) ఆగస్టు నుంచే ప్రారంభమవుతుందని ఎస్​బీఐ నివేదిక వెల్లడించింది. నెల రోజుల తర్వాత మూడో దశ తీవ్రస్థాయికి చేరుతుందని పేర్కొంది. మరోవైపు, టీకా పంపిణీలో పలు దేశాలతో పోలిస్తే వెనకబడినట్లు తెలిపింది.

covid third wave
కరోనా థర్డ్ వేవ్
author img

By

Published : Jul 5, 2021, 3:49 PM IST

రెండో దశ కరోనా(Corona Virus) ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్న వేళ భారతీయ స్టేట్ బ్యాంక్​ రూపొందించిన నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచే మూడో దశ వ్యాప్తి(Third wave) ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

'కొవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరిట ఎస్​బీఐ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. మే 7న భారత్.. రెండో దశ తీవ్ర స్థితికి చేరిందని తెలిపింది. ఈ గణాంకాలను బట్టి జులై రెండో వారంలో సుమారు రోజుకు పదివేల కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు రెండో అర్ధభాగంలో కేసులు పెరుగుతాయని పేర్కొంది.

నివేదికలో ఇంకేముందంటే..

  • ప్రపంచవ్యాప్త గణాంకాల ప్రకారం.. రెండో వేవ్​తో పోలిస్తే మూడో దశ​లో కేసులు సగటున 1.7 రెట్లు అధికంగా ఉంటున్నాయి.
  • కానీ, దేశంలో గత పోగడలను గమనిస్తే ఆగస్టు రెండో అర్ధభాగం నుంచే కేసులు పెరిగే అవకాశం ఉంది. నెల రోజుల తర్వాత కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరవచ్చు.
  • భారత్.. రోజుకు 40 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేస్తోంది. మొత్తంగా 4.6 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తైంది. 20.8 శాతం మంది ఒక డోసు తీసుకున్నారు. అయితే, యూఎస్, యూకే, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ చాలా తక్కువగా ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.