కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలు, రోజు రోజుకూ రికార్డు స్థాయికి చేరుతున్న ఇంధన ధరలతో.. దేశంలో విద్యుత్ వాహనాలకు(ఈవీ) డిమాండ్‌ను భారీగా ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020-23 మధ్య విద్యుత్ వాహనాల వృద్ధి వార్షిక ప్రాతిపదికన 26శాతం ఉండొచ్చని పేర్కొంది. అయితే కరోనా వల్ల తగ్గిన ఈవీల ఉత్పత్తి ఇందుకు సవాలుగా మారే అంశమని వెల్లడించింది.
'బడ్జెట్లో విద్యుత్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే.. విక్రయాలు మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. అయితే 2032 నాటికి మొత్తం విద్యుత్ వాహనాలనే విక్రయించాలనే లక్ష్యం మాత్రం సాధ్యం కాకపోవచ్చు.' అని ఫిచ్ వివరించింది.
కీలక ప్రోత్సాకాలు.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూపాయి పెంపు, విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.. విద్యుత్ వాహనాలు కొనే వారికి ఆదాయపు పన్ను ప్రోత్సాహకాల వంటివి ఇందుకు తోడ్పడతాయని ఈవీల విక్రయాలను పెంచే అంశాలని తెలిపింది.
ఆసియాలోనూ భారీ వృద్ధి..
ఆసియా ప్రాంతం మొత్తం మీద కూడా ఈవీ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుందని ఫిచ్ పేర్కొంది. ముఖ్యంగా చాలా దేశాలు ఈవీలను ప్రోత్సహించే విధానాలను పాటిస్తుండటం, కర్బన ఉద్గారాలను తగ్గించడం సహా విద్యుత్ వాహనాల తయారీ పెట్టుడులను ఆకర్షిస్తుండటం ఇందుకు కారణంగా పేర్కొంది.
ఆసియాలో ఈ ఏడాది 78.1 శాతం విక్రయాలు పెరుగతాయని అంచనా వేసింది ఫిచ్. గత ఏడాది ఇది 4.8 శాతం మాత్రమే కావడం గామనార్హం. అయితే 2030 నాటికి ఈ ప్రాంతంలో మొత్తం 10.9 మిలియన్ యూనిట్ల ఈవీలు మాత్రమే ఉంటాయని ఫిచ్ పేర్కొంది.
ఇదీ చదవండి:5G In India: అయిదోతరం.. ఆందోళన తరంగం