ETV Bharat / business

నాటి ఉద్యోగులే.. నేటి ఫ్రీలాన్సర్లు! - కరోనా కాలంలో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్

కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఇదే సమయంలో ఫ్రీలాన్సర్లకు మాత్రం డిమాండ్ పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కంపెనీల్లో.. అవసరమైనప్పుడు మాత్రమే అందుకు తగ్గ పారితోషికం చెల్లించి పనులు చేయించుకునే ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. దీనితో కొవిడ్ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది ఫ్రీలాన్సర్లుగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నారు.

rising Demand For Freelancer jobs
ఫ్రీలాన్సర్ ఉద్యోగులకు డిమాండ్​
author img

By

Published : Mar 29, 2021, 1:03 PM IST

కరోనా ప్రభావంతో సంస్థల్లో ఉద్యోగాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో ఫ్రీలాన్సర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫ్రీలాన్సర్లు అంటే ఒకరకంగా స్వతంత్ర ఉద్యోగులని చెప్పొచ్చు. ఒక నిర్దేశిక పని కోసం సంస్థలు వారిని నియమించుకుంటాయి. పనికి తగ్గ పారితోషికం చెల్లిస్తాయి. పని పూర్తయితే వారికి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ మళ్లీ వారి సేవలు అవసరమైతే.. కొత్త ప్రాజెక్టు, కొత్త పారితోషికం.. ఇలాగే సాగుతుంది.

కంపెనీలకూ ఖర్చు కలిసొస్తుంది..

లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టులు, పనులు తగ్గిపోయి ఉద్యోగుల నిర్వహణ సంస్థలకు భారంగా మారిపోయింది. దీంతో ఉద్యోగులను తొలగించాయి. అవసరమైనప్పుడు సేవలు అందించే వారికి అవకాశం కల్పించేందుకు సిద్ధమయ్యాయి. దీనికి ఫ్రీలాన్స్‌ ఉద్యోగులు సరిగ్గా సరిపోతారు. పని పూర్తి కాగానే.. మరో పని దొరికే వరకు ఉద్యోగుల నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే సంస్థలు ఫ్రీలాన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. పైగా కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం వల్ల వ్యాపారాల్లో ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో శాశ్వత ఉద్యోగుల కంటే ఫ్రీలాన్సర్లే మేలని భావిస్తున్నాయి కొన్ని సంస్థలు.

నైపుణ్యమే ఆధారం..

కరోనా సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక ఏళ్ల పాటు ఒకే రంగంలో పనిచేసి నైపుణ్యం సాధించిన వారిపైనా వేటు తప్పలేదు. దీంతో వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి వేటలో భాగంగా ఫ్రీలాన్సర్లుగా మారిపోతున్నారు. వారికున్న నైపుణ్యంతో అవసరమున్న సంస్థలకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

22 శాతం వృద్ధి..

ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ గణాంకాల ప్రకారం.. ఫ్రీలాన్సర్‌ జాబ్‌ మార్కెట్‌ 2019-2021 మధ్య 22 శాతం పుంజుకుంది. 2019తో పోలిస్తే గత ఏడాది మే-జూన్‌ మధ్య సంస్థలు ఫ్రీలాన్సర్లకు ఇచ్చే అవకాశాలు రెండింతలైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారడం సహా ఉపాధి కోసం ప్రత్యామ్నాయాల వైపు చూసిన వారి సంఖ్యా గణనీయంగానే పెరిగింది.

ఇద్దరికీ ప్రయోజనం..

పనిచేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణం మారడం, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు వంటి కారణాలు ఉద్యోగులను ఫ్రీలాన్సింగ్‌వైపు ఆకర్షిస్తున్న కొన్ని కారణాలు. ఫ్రీలాన్సింగ్‌ వల్ల ఉత్పాదకత కూడా మెరుగ్గా ఉంటుందని కొన్ని సర్వేలు తేల్చాయి. అయితే పనిపై ఉద్యోగికి ఒకరకమైన ‘ఓనర్‌షిప్‌’ ఫీలింగ్‌ కలుగుతుందని.. ఇది వినూత్న ఆలోచనలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రంగాల్లోనే డిమాండ్‌

కంప్యూటర్‌ ఆధారిత సంస్థల్లో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ టెక్నాలజీ, హెచ్‌ఆర్‌ సంస్థలు, ఫైనాన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వంటి రంగాల్లో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీహెచ్‌పీ డెవలపర్లు, రిక్రూటర్లు, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, కంటెంట్‌ రైటర్‌, డిజిటల్‌ మార్కెటర్లుగా పనిచేసే వారికి సంస్థలు అధిక మొత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయి.

ఇదీ చదవండి:ఈ ఏడాది ఐపీఓల్లో రూ.31వేల కోట్ల సమీకరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.