ETV Bharat / business

కరోనా విపత్తులోనూ ఔషధ ఎగుమతులు పెరిగాయ్‌

కరోనా మహమ్మారి సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ ఎగుమతులు పెరిగాయి. కరోనా సవాళ్లు తట్టుకొని 7.16% వృద్ధి నమోదైంది.

author img

By

Published : Aug 1, 2020, 6:49 AM IST

drug exports
కరోనా విపత్తులోనూ ఔషధ ఎగుమతులు పెరిగాయ్‌

జనరిక్‌ ఔషధాల విభాగంలో అగ్రగామిగా ఉన్న మనదేశం ప్రస్తుత 'కరోనా' కష్టకాలంలోనూ సత్తా చూపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఔషధ ఎగుమతుల్లో ఆకర్షణీయమైన వృద్ధి నమోదు చేసింది. వాస్తవానికి క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు అధికంగా ఉన్నాయి. దీనికి భిన్నంగా ప్రస్తుత మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి విస్తరణ వల్ల 'లాక్‌డౌన్‌', సిబ్బంది కొరత, ముడిపదార్ధాల కొరత, రవాణా సమస్యలను దేశీయ ఔషధ సంస్థలు ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినప్పటికీ ఔషధ ఎగుమతులు పెరిగాయి. ఏప్రిల్‌ నెలలో కొంత తగ్గినప్పటికీ మే, జూన్‌ నెలల్లో మెరుగుపడ్డాయి. మే నెలలో అధికంగా 14.30 వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి 5412.12 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నమోదైన 5050.33 మిలియన్‌ డాలర్ల ఎగుమతులతో పోల్చితే 7.16% వృద్ధి నమోదు చేసినట్లు అవుతోంది.

drug exports
ఔషధ ఎగుమతుల వివరాలు

ఫార్ములేషన్లు పెరిగాయి...

ఈ మొదటి త్రైమాసికంలో ఫార్ములేషన్లు (ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ వంటి తుది ఔషధాలు) అధికంగా ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో బల్క్‌ డ్రగ్స్‌- డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ తగ్గాయి. 'కరోనా' వల్ల పారాసెట్మాల్‌, హెచ్‌సీక్యూ, కొన్ని యాంటీ-బయాటిక్స్‌, యాంటీ-వైరల్‌ ఔషధాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఏర్పడింది. దీంతో ఈ ఔషధాలను దేశీయ కంపెనీలు పెద్దఎత్తున ఎగుమతి చేశాయి. కానీ అదే సమయంలో చైనా నుంచి ముడిపదార్ధాల సరఫరా తగ్గిపోవటంతో బల్క్‌ డ్రగ్స్‌- డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌కు గిరాకీ పెరిగింది. దీంతో దేశీయంగానే బల్క్‌ డ్రగ్స్‌కు డిమాండ్‌ ఏర్పడి ఈ విభాగంలో ఎగుమతులు తగ్గినట్లు తెలుస్తోంది.

లక్ష్యాన్ని చేరుకుంటాం: ఉదయ భాస్కర్‌

ఔషధ ఎగుమతులపై ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ స్పందిస్తూ, క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మెరుగైన వృద్ధి సాధించగలిగినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 22 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం కలుగుతోందన్నారు. కరోనా సంక్షోభంతో ల్యాటిన్‌ అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఆర్థిక కుంగుబాటు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్న నేపధ్యంలో వైద్య రంగం బడ్జెట్లను తగ్గించుకోవటానికి ఆయా దేశాల ప్రభుత్వాలు భారత ఔషధ కంపెనీల నుంచి తక్కువ ధరల్లో మందులు కొనుగోలు చేయటానికి ముందుకు వచ్చే పరిస్థితి వస్తుందని విశ్లేషించారు.

ఇదీ చూడండి: 'సీరం' క్లినికల్​ ట్రయల్స్​ అనుమతులకు కమిటీ సిఫారసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.