సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్ (El Salvador Bitcoin) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin news)) వినియోగాన్ని తమ దేశంలో అధికారికం చేసినట్లు ప్రకటించింది. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకేలే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
-
3 minutos para hacer historia.
— Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
In 3 minutes, we make history.#BitcoinDay #BTC🇸🇻
">3 minutos para hacer historia.
— Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 7, 2021
In 3 minutes, we make history.#BitcoinDay #BTC🇸🇻3 minutos para hacer historia.
— Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 7, 2021
In 3 minutes, we make history.#BitcoinDay #BTC🇸🇻
అంతకు ముందు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా రెండు దశల్లో.. 400 బిట్కాయిన్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. వీటి విలువ 20 మిలియన్ డాలర్లపైమాటే.
క్రిప్టోకరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా వివిధ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఓ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈ నిర్ణయంతో అమెరికా డాలర్‌తో పాటు.. ఇప్పుడు బిట్‌కాయిన్ కూడా ఆ దేశంలో అధికారికంగా చలామణిలోకి వచ్చింది. దీనితో ఇకపై ఆ దేశ పౌరులు.. పన్నులను బిట్‌కాయిన్ ద్వారా చెల్లించొచ్చు. వస్తు, సేవలకు కూడా దీనిని వినియోగించొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్‌లు ఇకపై బిట్‌కాయిన్ ధరలను కూడా డిస్ప్లేలో ఉంచాల్సి ఉంటుంది.
చట్ట సభల్లో ఆమోదం తర్వాతే..
ఎల్ సాల్వడార్ కాంగ్రెస్‌లో జులైలోనే దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 84 మంది సభ్యుల్లో 64 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. దీనితో బిట్‌కాయిన్‌ను అధికారికం చేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది.
వారికి మేలు..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాల్లో ఉంటున్న ఆ దేశ పౌరులు తమ వాళ్లకు డబ్బులు పంపించడం సులభతరమవుతుందన్న అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం మరింత మందికి ఆర్థిక సేవలను దగ్గర చేసేందుకు ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిర్ణయం హాని చేయొచ్చు..
అయితే ప్రస్తుతం ఆ దేశంలోని 70 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో అధిక అస్థిరతలు ఉండే బిట్‌కాయిన్ వంటి వాటి వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు హాని జరగొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయి అయిన 60 వేల డాలర్ల పైకి చేరిన బిట్‌కాయిన్ విలువ(Bitcoin value).. ఆ తర్వాత సగానికి పైగా పతనమైంది. ప్రస్తుతం మళ్లీ 51 వేల డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని పలు ఆర్థిక సంస్థలు హెచ్చరికలు కూడా చేస్తున్నాయి.
ఇదీ చదవండి: Bitcoin: పాస్‌వర్డ్ చెప్పకుండా చనిపోతే..?