ETV Bharat / business

భారత్‌లో ఉద్యోగుల వేతనాల పెంపు 7.8 శాతమే!

భారత్​లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను సగటున 7.8 శాతం పెంచే అవకాశం ఉందని ఓ సర్వే పేర్కొంది. వేతనాలు పెంపు పెద్దగా ఉండకపోవటానికి కంపెనీల లాభాలపై ఒత్తిడి, ఆర్థిక మందగమన సవాళ్లే కారణమని తెలిపింది.

In India, the salary increase of employees is 7.8%
భారత్‌లో ఉద్యోగుల వేతనాల పెంపు 7.8 శాతమే
author img

By

Published : Mar 5, 2020, 12:07 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు సగటున తమ ఉద్యోగుల వేతనాలను 7.8 శాతం పెంచే అవకాశం ఉందని ఓ సర్వే వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 8.2 శాతం వేతన పెంపుతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. ఉద్యోగుల వేతనాల ధోరణులపై డెలాయిట్‌ ఇండియా ఈ సర్వే నిర్వహించింది. కంపెనీల లాభాలపై ఒత్తిడి, ఆర్థిక మందగమన సవాళ్ల నేపథ్యంలో ఈసారి వేతనాల పెంపు పెద్దగా ఉండకపోవచ్చన్నది ముందుగానే ఊహించిందేనని డెలాయిట్‌ ఇండియా పేర్కొంది.

7 రంగాలు, 20 ఉపరంగాలకు చెందిన 300 సంస్థల మానవ వనరుల విభాగం మేనేజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. వేతనాల పెంపు, పనితీరు నిర్వహణ, నియామకాలు, పారితోషికాల రూపకల్పన లాంటి పలు అంశాలపై సర్వేలో అభిప్రాయాలను అడిగి నివేదికను రూపొందించారు. వ్యయనియంత్రణలో భాగంగా వేతనాల పెంపునకు పనితీరు, సామర్థ్యానికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని సర్వేలో తేలింది. గతేడాది పనితీరు ఆధారంగా వేతనాలు పెంపును నిర్ణయిస్తున్నారని 90 శాతం కంపెనీలు అభిప్రాయపడగా... సామర్థ్యం ఆధారంగా వేతనాల పెంపు ఉంటుందని 34 శాతం సంస్థలు వెల్లడించాయి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా..

  • 2020-21లో వేతనాల పెంపు 8 శాతం లోపే ఉండొచ్చని సర్వేలో పాల్గొన్న 50 శాతం కంపెనీలు అంచనాలు వ్యక్తం చేశాయి.
  • 10 శాతానికి మించి వేతన పెంపు ఉండొచ్చని కేవలం 8 శాతం కంపెనీలు భావిస్తున్నాయి.
  • ఆయా హోదాల ఆధారంగా వేతనాల పెంపులో వ్యత్యాసం ఉంటుందని 30 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.
  • మౌలికం, స్థిరాస్తి, ఎన్‌బీఎఫ్‌సీ, టెలికాం లాంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకోవడం దేశవ్యాప్తంగా 15 శాతానికి తగ్గగా.. తొలగింపులు 20 శాతానికి పెరిగాయని సర్వే గుర్తించింది. వాహన, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో ఉద్యోగాల తొలగింపులు ఎక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది.
  • ఆటోమేషన్‌ ప్రభావంతో ఆయా కంపెనీలు నియామకాలు తగ్గించుకుంటున్నట్లు కూడా సర్వేలో తేలింది.

ఇదీ చూడండి:కరోనాతో ఐటీ కంపెనీలకు కొత్త చిక్కులు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.