ETV Bharat / business

ఉద్రిక్తతలున్నా చైనా నుంచి జోరుగా దిగుమతులు

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ గత ఏడాది ఆ దేశం నుంచి భారత్​కు దిగుమతులు కొనసాగినట్లు కేంద్రం తెలిపింది. దాదాపు 58.71 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తృణమూల్‌ ఎంపీ మాలా రాయ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ పురి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.

Imports from china has improved last year despite tensions between these two countries
చైనా నుంచి దిగుమతులు పెరిగాయ్..
author img

By

Published : Mar 18, 2021, 4:44 PM IST

సరిహద్దు ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్‌కు దిగుమతులు చేసే దేశాల జాబితాలో 2020కిగానూ చైనా అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో చైనా నుంచి దాదాపు 58.71 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువుల దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ పురి లోక్‌సభలో వెల్లడించారు. తృణమూల్‌ ఎంపీ మాలా రాయ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ మేరకు సమాధానం చెప్పారు.

దేశానికి అత్యధికంగా దిగుమతులు చేసే దేశాల జాబితాలో.. చైనా, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్‌ ఉన్నాయన్నారు. దేశ మొత్తం దిగుమతుల్లో ఈ 5 దేశాల నుంచే 38 శాతం దిగుమతి అవుతుందని పేర్కొన్నారు. చైనా నుంచి ఎక్కువగా టెలికాం పరికరాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌, ఎరువులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దిగుమతి అవుతున్నాయని హర్దీప్ పురీ వెల్లడించారు.

ఇదీ చదవండి: అమెజాన్​, ఉద్యోగుల మధ్య 'యూనియన్' రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.