దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యూందాయ్ పలు మోడల్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మోడల్స్‌ను బట్టి దాదాపు రూ.1.5 లక్షల వరకు రాయితీలు ఉన్నాయి. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్,ఆరా,ఐ20, కోనాఈవీపై వర్తిస్తాయి. హ్యూందాయ్ వెబ్‌సైట్లో వినియోగదారుల కోసం ఆఫర్ల జాబితాను ఉంచింది. ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.
గ్రాండ్ ఐ10 నియోస్‌పై అత్యధికంగా రూ.45వేలు మేరకు ఆఫర్లను ఇచ్చింది. వీటిల్లో రూ.30వేలు నగదు డిస్కౌంట్, రూ.10వేలు ఎక్స్‌ఛేంజి బెనిఫిట్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్ వర్తిస్తాయి.
ఈవీపై భారీ డిస్కౌంట్..
శాంత్రో హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం మీద రూ.35 వేలు లబ్ధి దొరకనుంది. వీటిలో రూ.20 వేలు నగదు, రూ.10 వేలు క్యాష్, రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్లను అందజేస్తోంది. ఇక ఆరా మోడల్‌పై అత్యధికంగా రూ.45 వేలు లబ్ధి చేకూరనుంది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్‌ఛేంజి బెనిఫిట్ రూ.10వేలు, కార్పొరేట్ తగ్గింపు రూ.5 వేలు అందనుంది. దీనిలోని సీఎన్‌జీ వేరియంట్ పై అత్యధికంగా రూ.17,300 తగ్గింపు ఉంది. ఇక హ్యూందాయ్ కోనా ఈవీపై అత్యధికంగా రూ.1.5లక్షలు లబ్ధి లభించనుంది. దీనిలో ఎక్స్‌ఛేంజి బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు లేవు.
కొత్త తరం ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై అత్యధికంగా రూ.15,000 ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్లు లేవు. కేవలం ఎక్స్‌ఛేంజి బోనస్ కింద రూ.10 వేలు, కార్పొరేట్ లబ్ధి కింద రూ.5 వేలు లభిస్తుంది.
ఇదీ చదవండి:'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?