ETV Bharat / business

ఛార్జీలు లేవ్.. మరి జీపే, పేటీఎంకు ఆదాయం ఎలా?

author img

By

Published : May 4, 2021, 3:00 PM IST

కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకు.. రోడ్డు పక్కనుండే ఫుడ్​ ట్రక్​ నుంచి లగ్జరీ రెస్టారెంట్ వరకు ఇలా అన్నింటిలో ఇప్పుడు చెల్లింపులు చేసేందుకు ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం వంటి డిజిటల్​ పేమెంట్​ యాప్​లు వినియోగిస్తున్నారు. అయితే ఆయా యాప్​లు మీ నుంచి ఛార్జీలు వసూలు చేయకుండా లభాలను ఎలా గడిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?

How Digital payment Apps Get money
పేమెంట్ యాప్​లకు లాభాలు ఎలా వస్తాయి

ఒకప్పుడు హోటల్​, రెస్టారెంట్, సూపర్​ మార్కెట్​లకు వెళ్తే.. క్యాష్​ లేదా కార్డ్ తీసుకెళ్లడం తప్పనిసరి. కానీ ఇప్పుడు స్మార్ట్​ఫోన్ ఉంటే చాలు. ఎందుకంటే డిజిటల్​ పేమెంట్ యాప్​లు (గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎం వంటివి) ఆ అవసరాన్ని తీరుస్తున్నాయి.

Paytm
పేటీఎం

ఈ యాప్​లతో ఎవరికైనా కేవలం ఫోన్ నంబర్ సహాయంతో డబ్బులు పంపవచ్చు. చిన్న మొత్తాల నుంచి రూ.లక్ష వరకు ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు అందిస్తున్నా.. వినియోగదారుల నుంచి ఈ యాప్​లు ఛార్జీలు వసూలు చేయవు.

పెరిగిన రెవెన్యూలు..

2018-19లో గూగుల్ పే ఇండియా ఆదాయం రూ.1,119 కోట్లుగా ఉంది. 2019-20లో అది రూ.1501.7 కోట్లకు పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.33 కోట్ల లాభాన్ని గడించింది.

Gpay
గూగుల్ పే

ఫోన్ పే 2018-19 సంవత్సరంలో రూ.245 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అది 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 427 కోట్లకు పెరిగింది. అయితే ఫోన్ పే నష్టాల్లోనే ఉంది.

Phone Pay
ఫోన్​ పే

యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనప్పుడు ఈ యాప్​లు ఇంత మొత్తం ఆదాయాలు ఎలా గడించాయనేగా మీ సందేహం. అదేలానో ఇప్పుడు చూద్దాం.

ఆదాయ మార్గాలు ఇవే..

నిజానికి ఈ యాప్​లకు యూపీఐ పేమెంట్స్ వల్ల ఎలాంటి ఆదాయం రాదు. ఇవి పేమెంట్స్ మాత్రమే కాకుండా చాలా రకాల సర్వీసులను అందిస్తుంటాయి. మొబైల్ రీఛార్జ్​, కరెంట్​ బిల్​, గ్యాస్​ బిల్​, క్రెడిట్ కార్డ్ బిల్​ లాంటివి.

మొబైల్ రీఛార్జ్​ తీసుకున్నట్లయితే టెలికాం కంపెనీలు ప్రతి లావాదేవీపై ఈ యాప్​లకు కమీషన్ ఇస్తుంటాయి. ఇదే విధంగా ఆయా యాప్​లు అందించే ఇతర సేవలకూ కమీషన్​ రూపంలో ఆదాయం వస్తుంది.

వస్తు, సేవల ప్రమోషన్​, వివిధ రకాల యాప్​ల ప్రచారం కూడా ఈ డిజిటల్​ పేమెంట్ యాప్​లు నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఫోన్​పేలో.. గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవలను అందిస్తుంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.

డేటా..

డేటాను కొత్త తరహా ఇంధనంగా అభివర్ణిస్తుంటారు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్​లలో వినియోగదారులు చేసే లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు తెలుస్తాయి. ఈ డేటాను వివిధ కంపెనీలకు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేసాయి. ఫలితంగా పేమెంట్ యాప్​లకు ఆదాయం లభిస్తుంది. ఆ డేటాను కొనుగోలు చేసిన కంపెనీలు.. వినియోగదారుడి అలవాట్లకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.