ETV Bharat / business

ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఇళ్ల విక్రయాల్లో వృద్ధి - హైదరాబాద్​లో ఇళ్ల ధరలు

దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2019లో స్థిరాస్తి రంగం జోరు కనబర్చింది. 2018తో పోలిస్తే దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస గృహ అమ్మకాలు పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. అన్ని అడ్డంకులను దాటుకొని స్థిరాస్తి రంగం అభివృద్ధివైపు దూసుకెళ్లినట్లు వెల్లడించింది.

Housing sales saw marginal rise in 2019 despite economic slowdown: Knight Frank
ప్రతికూలతలు ఉన్నప్పటికీ దూసుకెళ్లిన గృహాస్తి రంగం
author img

By

Published : Jan 8, 2020, 8:04 AM IST

2019లో ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ దేశీయంగా గృహ విక్రయాల్లో పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 2.46 లక్షల ఇళ్లు అమ్ముడుపోయినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ 'నైట్ ఫ్రాంక్'​ వెల్లడించింది. 2018తో పోలిస్తే గతేడాదిలో నివాస ఆస్తుల అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైనట్లు నివేదికలో తెలిపింది. దేశీయంగా ఉన్న అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని హౌసింగ్ మార్కెట్ అభివృద్ధి చెందినట్లు స్పష్టం చేసింది.

2019లో ఇళ్ల ధరలు కూడా స్పల్పంగా పెరిగినట్లు నైట్​ ఫ్రాంక్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముద్దాసిర్ జైదీ తెలిపారు. గతేడాది ఇళ్ల ధరలు 4 నుంచి 5 శాతం పెరిగినట్లు వెల్లడించారు. అయితే 2015తో పోలిస్తే ఇది చాలా స్పల్పమేనని స్పష్టం చేశారు.

2.45 లక్షల విక్రయాలు

2018లో 2,42,328 యూనిట్ల విక్రయాలు జరగ్గా... 2019లో ఈ సంఖ్య 2,45,861కి చేరిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా స్థిరాస్తి వ్యాపారులు సైతం ధరల్లో సరళంగా వ్యవహరించడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని అభిప్రాయపడింది.

బెంగళూరులో అధికం

దిల్లీ-ఎన్​సీఆర్ ​(దేశ రాజధాని ప్రాంతం), బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్​లో గృహ విక్రయాల్లో పెరుగుదల నమోదు కాగా ముంబయి, పుణె, కోల్​కతా నగరాల్లో విక్రయాలు తగ్గినట్లు తెలిపింది. బెంగళూరులో అత్యధికంగా 10 శాతం పెరిగి 42,828 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించింది. చెన్నైలో 6 శాతం వృద్ధితో 16,959, హైదరాబాద్​లో 4 శాతం వృద్ధితో 16,267 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు స్పష్టం చేసింది.

మరోవైపు కోల్​కతాలో 12 శాతం తగ్గి 11,266 యూనిట్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు తెలిపింది. ముంబయిలో 5 శాతం, పుణెలో 2 శాతం విక్రయాలు తగ్గినట్లు పేర్కొంది. ఆర్థిక రాజధాని ముంబయిలో గతేడాది 60,943 అపార్ట్​మెంట్ల అమ్మకాలు జరగ్గా... పుణెలో 32,809 యూనిట్లు అమ్ముడైనట్లు నివేదికలో వెల్లడించింది.

ఏడాది సానుకూలమే

అయితే 2019 ఏడాది స్థిరాస్తి వ్యాపార రంగానికి అత్యంత సానుకూలమేనని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ షిషిర్ బైజాల్ తెలిపారు.

"తగ్గుముఖం పట్టిన జీడీపీ వృద్ధి రేట్లు, పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనం, వినియోగదారుల సెంటిమెంట్లు వంటి అంశాలు ఏడాది మొత్తం ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. అయినప్పటికీ ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ ఇటీవల కల్పించిన ప్రోత్సాహాల కారణంగా రియల్ ఎస్టేట్​ రంగంపై వినియోగదారుల దృష్టి మరల్చేలా చేశాయి."-షిషిర్ బైజాల్, ఎండీ, ఛైర్మన్ నైట్​ ఫ్రాంక్​

ఆఫీసు స్థలాలు కూడా

కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే స్థలాల పరిమాణమూ గతేడాది భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2018తో పోలిస్తే 27 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక స్పష్టం చేసింది. రికార్డుస్థాయిలో 60.6 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీసుల కోసం ఆయా సంస్థలు లీజుకు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ వృద్ధికి ఐటీ సెక్టార్ ప్రధాన కారణమని పేర్కొంది. ఆఫీసుల కోసం లీజుకు అందుబాటులో ఉంచే స్థలాల్లో సైతం భారీ పెరుగుదల నమోదైంది. గతేడాదితో పోలిస్తే 56 శాతం వృద్ధితో 61.3 మిలియన్ చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Brussels - 7 January 2020
1. European Union foreign policy chief Josep Borrell arriving at lectern
2. SOUNDBITE (English) Josep Borrell, European Union foreign policy chief:
"We are calling for an immediate stop to any further escalation of violence, and also to the external interference which has been increasing on the last day. As you know Libya is a priority for the European Union and we will be actively engaged with all relevant actors in our efforts to stop the hostilities and achieve the resumption of a political dialogue. We know that the situation is worsening day by day, and the only solution to Libya, once again, we have to repeat, has to be a political negotiation among the parts, there is no military solution."
3. Borrell taking question
4. SOUNDBITE (English) Josep Borrell, European Union foreign policy chief:
"We asked for a ceasefire and we asked also to stop escalation and to external interference which has been increasing in the last days. It is obvious that this makes a reference to the Turkish decision to intervene with their troops in Libya, which is something that we reject and we, increases our worries about the situation in Libya. I haven't said that very explicitly but it's clear to someone who wants to understand that when I am saying about the increased external interference I am making reference to the interference of Turkey."
5. News conference room
6. Borrell leaving
STORYLINE:
The European Union has called on Turkey to stop its "interference" in conflict-ravaged Libya and appealed to forces fighting in the northern African country to call a ceasefire around the capital Tripoli.
After a meeting with French, British, German and Italian foreign ministers in Brussels on Tuesday, EU foreign policy chief Josep Borrell told media that the situation in Libya is getting worse.
"We are calling for an immediate stop of further escalation of violence, and also to the external interference which has been increasing in the last days," Borrell said.
"We know that the situation is worsening day by day, and the only solution to Libya, once again, we have to repeat, has to be a political negotiation among the parts, there is no military solution," he added.
Borrell also condemned Turkey's decision to send troops to Libya to assist the UN-recognised Tripoli government in fighting the country's east-based forces.
"When I am saying about the increased external interference I am making reference to the interference of Turkey," Borrell said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.