ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు (Hosing sales data India) భారీగా పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదిక (JLL housing sales report) వెల్లడించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు రెండు రెట్లకుపైగా పెరిగి.. 32,358 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.
గత ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 14,415 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి. 2021 రెండో త్రైమాసికంలో 19,635 యూనిట్లు అమ్ముడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- 2021 క్యూ3లో హైదరాబాద్ (Housing sales in Hyderabad) రెండింతలకుపైగా వృద్ధిని నమోదు చేసింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4,418 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 2,122 ఇళ్లు విక్రయమయ్యాయి.
- బెంగళూరులో (Housing sales in Bengaluru) ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 5,100 ఇళ్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,742గా ఉంది.
- చెన్నైలో మాత్రం 2021 క్యూ3లో ఇళ్ల విక్రయాలు (Housing sales in Chennai) గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 1,570 యూనిట్ల నుంచి 1,500 యూనిట్లకు పడిపోయాయి. 7 ప్రధాన నగరాల్లో క్షీణతను నమోదు చేసింది చెన్నై మాత్రమే.
- దిల్లీ-ఎన్సీఆర్లో 2021 జులై-సెప్టెంబర్ 4,418 ఇళ్లు (Housing sales in Delhi-NCR) అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,122గా ఉంది.
- కోల్‌కతాలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Kolkata) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగాయి. మొత్తం 1,974 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 క్యూ3లో 390 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి.
- ముంబయిలో ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య 6,756 ఇళ్లు (Housing sales in Mumbai) విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ 4,135 ఇళ్లు అమ్ముడయ్యాయి.
- పుణెలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Pune) నాలుగు రెట్లకుపైగా పెరిగాయి. 2021 జులై-సెప్టెంబర్ సమయంలో 5,921 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,344 యూనిట్లు విక్రయమయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఇలా..
ఈ ఏడాది మొత్తం మీద చూస్తే.. సెప్టెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 77,576 ఇళ్ల విక్రయాలు నమోదైనట్లు తెలిపింది జేఎల్ఎల్ నివేదిక. గత ఏడాది ఇదే సమయంలో 52,619 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుండటానికి తోడు.. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతమవడం వంటి కారణాలు ఇళ్ల విక్రయాలు పెరిగేందుకు దోహదం చేసినట్లు నివేదిక పేర్కొంది.
ఇవీ చదవండి: