ETV Bharat / business

'2020 క్యూ4లో 78% పెరిగిన ఇళ్ల విక్రయాలు'

2020 నాల్గో త్రైమాసికంలో(2019 క్యూ4తో పోలిస్తే) ఇళ్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. ప్రాప్​ఈక్విటీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అదే ఏడాది క్యూ3తో పోలిస్తే ఇళ్ల విక్రయాల డిమండ్ ఏకంగా 78 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. పండుగ సీజన్ ఇందుకు కలిసొచ్చినట్లు తెలిపింది.

Housing sales in 2020 Q4
క్యూ4లో ఇళ్ల డిమాండ్ 78 శాతం జంప్
author img

By

Published : Jan 20, 2021, 6:02 PM IST

దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2020 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్​) 1,10,811 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 2019 ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 25 శాతం ఎక్కువని.. డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్​ఈక్విటీ నివేదిక ద్వారా వెల్లడైంది. 2019 చివరి త్రైమాసికంలో 88,976 గృహ విక్రయాలు నమోదైనట్లు తెలిసింది.

కరోనా కారణంగా 2, 3 త్రైమాసికాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా పడిపోయినా.. పండుగ సీజన్​ జోరుతో చివరి త్రైమాసికంలో మాత్రం 78 శాతం వృద్ధి (క్యూ3తో పోలిస్తే) నమోదైనట్లు నివేదిక వివరించింది ప్రాప్​ఈక్విటీ. 2020 క్యూ3లో 62,197 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది.

పూర్తి ఏడాది పరంగా..

2019(3,41,466 యూనిట్లు)తో పోలిస్తే 2020లో ఇళ్ల విక్రయాలు 16 శాతం తగ్గి.. 2,86,951 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక తెలిపింది. కరోనా నేపథ్యలో విధించిన లాక్​డౌన్​లో డిమండ్​ భారీగా పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా వివరించింది.

ఇదీ చూడండి:అన్ని సందేహాలకు సమాధానమిస్తాం: వాట్సాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.