ETV Bharat / business

house prices have gone up in Hyderabad: 'హైదరాబాద్​లోనే ఇళ్ల ధరలు పెరిగాయి' - తెలంగాణ బిజినెస్​ న్యూస్​

ఇళ్ల కొనుగోలుదార్లకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని జేఎల్​ఎల్​ ఇండియా(jl india) పేర్కొంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు స్థిరంగా ఉండగా.. హైదరాబాద్​లోనే పెరిగాయని వివరించింది. ( house prices have gone up in Hyderabad).

house price increased
house price increased
author img

By

Published : Sep 28, 2021, 10:43 AM IST

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్‌లోనే పెరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా(jll india) పేర్కొంది( house prices have gone up in Hyderabad). 2013 నుంచి 2021 మధ్యకాలంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ప్రజల్లో ఇల్లు కొనుగోలు చేసే శక్తి పెరిగినట్లు ‘హోమ్‌ పర్చేజ్‌ అఫోర్డబులిటీ ఇండెక్స్‌- 2021’ నివేదికలో వివరించింది. గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గడం, ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉండటం కలిసొస్తోందని వెల్లడించింది.

ఈ ఏడాదిలో కుటుంబ ఆదాయాలు గత ఏడాదితో పోల్చితే 7-9% మేరకు పెరిగాయని, గృహ రుణాలపై వడ్డీరేట్లు 15 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదార్లకు అత్యంత అనుకూలమైన నగరంగా కోల్‌కతా ఉందని, తదుపరి స్థానాల్లో హైదరాబాద్‌, పుణె ఉన్నాయని వివరించింది. ‘1,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు అవసరమైన సగటు ఆదాయం హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లోని ప్రజలకు అధికంగా ఉంది’ అని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఇళ్ల ధరలు 15 శాతం పెరగొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.