జపాన్‌కు చెందిన ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) దేశీయ మార్కెట్లో వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు కంపెనీ డీలర్ ఒకరు చెప్పారు.
కరెన్సీ ప్రభావం, ఇన్పుట్ వ్యయంలో ఒత్తిడి కారణంగా ధరలు పెంచాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. హోండా అమేజ్ నుంచి ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వి వరకు పెంచిన ధరలు వర్తిస్తాయని తెలుస్తోంది. దిల్లీ మార్కెట్లో ప్రస్తుతం అమేజ్ ధర రూ .6.17 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఎంట్రీ లెవల్ సీఆర్-వి రూ. 28.71 లక్షలుగా ఉంది.