గతేడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు 14 శాతం పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. నవంబర్ నియామకాలతో పోల్చితే... yrమా రంగం, ఇతర సహాయక రంగాలలో ఉద్యోగకల్పన ఎక్కువగా ఉందని వెల్లడైంది.
డిసెంబర్లో 1,972 మంది ఉద్యోగం సంపాదించగా... నవంబర్‌లో ఈ సంఖ్య 1,727గా ఉందని నౌకరీ జాబ్ స్పీక్ సూచీ-2020 వెల్లడించింది. మునుపటి ఏడాదిలో జరిగిన నియామకాలతో పోల్చితే 2020లో ఉద్యోగావకాశాలు 10 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఇందుకు కొవిడ్ సంక్షోభమే కారణమని ప్రస్తావించింది.
నౌకరీ డాట్ కామ్ ద్వారా నెలల వారీగా వచ్చిన ఉద్యోగాలను లెక్కిస్తూ నివేదిక రూపొందిస్తుంది ఈ నౌకరీ జాబ్ స్పీక్ సూచీ.
2020లో... కరోనా నేపథ్యంలో ఉద్యోగ నియామకాలపై ప్రభావం పడిందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ అధికారి పవన్ గోయల్ అన్నారు. 2019తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 56 శాతం ఉద్యోగ నియామకాలు తగ్గాయని పేర్కొన్నారు.
నవంబర్‌తో పోల్చితే...
- బీమా రంగం నియామకాలు 2020 డిసెంబర్లో 45 శాతం పెరిగాయి.
- ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ రంగాల్లో నియామకాలు స్పల్పంగా పెరిగాయి.
- మెట్రోపాలిటన్ నగరాలైన దిల్లీ, పుణెలో నియామకాలు 18, 16 శాతంగా ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోల్‌కతా(14), ముంబయి(10) ఉన్నాయి.
- లాక్డౌన్ సడలింపుల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లలోనూ నియామకాలు 13 శాతం పెరిగాయి.
ఇదీ చదవండి:టీసీఎస్ బైబ్యాక్‌తో టాటా సన్స్‌కు రూ.10 వేల కోట్లు