ETV Bharat / business

హెటిరో కరోనా ఔషధం ప్యాక్ విడుదల- ధర ఎంతంటే?

స్వల్ప, మధ్య స్థాయి కరోనా బాధితులకు వాడే జనెరిక్ ఔషధం ఫావివిర్ 800/200ను భారత్​లో విడుదల చేసింది ఔషధ సంస్థ హెటిరో. మొత్తం 18 మాత్రలతో కూడిన ప్యాక్ ధర రూ.2,640గా నిర్ణయించింది.

HETERO COVID DRUG DETAILS
హెటిరో నుంచి కరోనా ఔషధం
author img

By

Published : Sep 25, 2020, 8:00 PM IST

దేశీయ ఔషధ తయారీ సంస్థ హెటిరో.. స్వల్ప, మధ్యస్థ స్థాయి కరోనా బాధితులకు వినియోగించే జనరిక్ ఔషధం ఫావివిర్ 800/200ను భారత్​లో విడుదల చేసినట్లు ప్రకటించింది.

800 ఎంజీ పరిమాణంలోని 16 ఫావిపిరవిర్ మాత్రలు.. 200 ఎంజీ పరిమాణంలోని 2 ఫావిపిరవరి మాత్రలతో కూడిన ప్యాక్​ ధర రూ.2,640గా నిర్ణయించింది హెటిరో.

అధిక సామర్థ్యమున్న ఫావిపిరవిర్ 800 ఎంజీ ఔషధానికి.. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు తెలిపింది హెటిరో. వీటిని హెటిరో హెల్త్​కేర్ లిమిటెడ్ ద్వారా మార్కెటింగ్, పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:జీఎస్​టీ చట్టం ఉల్లంఘించిన కేంద్రం: కాగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.