ప్రముఖ విద్యుత్ వాహన మోడళ్లపై 33శాతం వరకు ధరలను తగ్గించినట్లు హీరో ఎలక్ట్రిక్ శుక్రవారం వెల్లడించింది. ఫేమ్ 2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం కింద సబ్సిడీని కేంద్రం పెంచడం మూలంగా.. ఆ లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ మోడళ్లపై 12శాతం, 3 బ్యాటరీల వేరియంట్లపై 33శాతం ధరలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
ఇవే కొత్త ధరలు..
మోడల్ | కొత్త ధర | పాత ధర |
ఫోటాన్ హెచ్ ఎక్స్ | రూ.71,449 | రూ.79,940 |
ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ | రూ.85,136 | రూ.1,13,115 |
ఆప్టిమా ఈఆర్ | రూ.58,980 | రూ.78,640 |
అవి మాత్రం భారమే..
అయితే సాధారణ ద్విచక్రవాహనాల ధరలను మరోసారి పెంచింది హీరో మోటోకార్ప్. బైకులు, స్కూటర్లపై రూ.3వేల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు అన్ని టూవీలర్లకు వర్తిస్తుందని స్పష్టంచేసింది. పెరిగిన ధరలు 2021 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ధరల పెంపులో మార్పులుంటాయి.
ముడి పదార్ధాల ధరలకు రెక్కలు వచ్చినందు వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగినట్లు హీరో తెలిపింది. దీంతో తప్పనిసరిగా ధరలను పెంచుతున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్లోనూ ఇదే కారణంతో ధరలను పెంచింది హీరో.
ఇదీ చూడండి: హీరో నుంచి ఎలక్ట్రిక్ వాహనం ఎప్పుడంటే..?