ETV Bharat / business

సాయం చేసేందుకు ముందుకొచ్చిన 'హీరో' - వ్యాపార వార్తలు

దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు తమవంతు సాయం చేసేందుకు హీరో సైకిల్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కొవిడ్​-19 కారణంగా ఆర్థికంగా దెబ్బతినే ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములను ఆదుకునేందుకు రూ.100 కోట్లను సిద్ధం చేసింది.

HERO CYCLES CORONA FUND
కరోనా కట్టడికి హీరో సాయం
author img

By

Published : Mar 25, 2020, 7:01 AM IST

కరోనా వైరస్‌ కారణంగా ఆర్థికంగా దెబ్బతినే ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములకు అండగా నిలిచేందుకు హీరో సైకిల్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ముందుకొచ్చింది. దాదాపు రూ.100 కోట్లను సిద్ధం చేసింది. ఈ విపత్తు సమయంలో తమ ప్లాంట్లు ఉన్న పంజాబ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొంది.

"ఒక సంస్థగా మేం మానవీయ దృక్పథంతో వ్యాపార నియమాలకు కట్టుబడి ఉన్నాము. ఈ విపత్తు నుంచి మా చుట్టుపక్కల వాతావరణం కోలుకునేందుకు రూ.100కోట్ల నిధిని సిద్ధం చేశాము. మాకు తోచిన సాయం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే తెలియజేశాం" - హీరో సైకిల్స్‌ కంపెనీ.

ఇదీ చూడండి:'పశువుల గురించి కూడా కాస్త ఆలోచించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.