ETV Bharat / business

బ్యాంకర్ల వేతనాల్లో 'హెచ్​డీఎఫ్​సీ' ఎండీనే టాప్​ - Aditya Puri annual package

దేశీయంగా బ్యాంకు ఉన్నతాధికారుల్లో అత్యధిక వేతనం పొందినవారిగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి నిలిచారు. గత ఆర్థిక ఏడాదిలో ఆయన మొత్తంగా సుమారు రూ. 180 కోట్ల వేతనాన్ని పొందారు.

HDFC Bank's Aditya Puri highest paid banker in FY20 with Rs 18.92 cr in remuneration
బ్యాంకు అధికారులు వేతనాల్లో హెచ్​డీఎఫ్​సీ ఎండీనే టాప్​
author img

By

Published : Jul 20, 2020, 12:27 PM IST

గత ఆర్థిక ఏడాదిలో బ్యాంకు ఉన్నతాధికారుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పురి అధిక వేతనం అందుకున్నారు. గత 25 ఏళ్లలో ప్రైవేటు రంగంలో ఈ బ్యాంకుకు అధిక ఆస్తులు సమకూర్చడంలో, మదుపర్ల నుంచి అధిక విలువ లభించేలా చేస్తున్నారు ఆదిత్య. ఈ మేరకు ఆయనకు రూ.18.92 కోట్ల వేతనం, స్టాక్‌ ఆప్షన్స్‌ కింద మరో రూ.161.56 కోట్లు లభించాయి.

గతేడాది వివరాలు..

2018-19లో స్టాక్‌ ఆప్షన్స్‌ కింద రూ.42.20 కోట్లు, స్థూల వేతనం కింద రూ.13.65 కోట్లు అందుకున్నారు ఆదిత్య. ఇప్పటికే 70 ఏళ్లకు చేరువైన ఆదిత్య.. ఈ ఏడాది అక్టోబర్​లో పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. ఈయన స్థానంలో గ్రూప్​ అధిపతి శశిధర్​ జగ్​దీశన్​ నియమితులయ్యే అవకాశాలున్నాయి. జగ్​దీశన్ 2019-20 ఆర్థిక ఏడాదికి గానూ రూ.2.91 కోట్ల వేతనం పొందారు.

మిగతా బ్యాంకు ఉన్నతాధికారుల వేతనాలు ఇలా..

  • ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సందీప్‌ భక్షి 2019-20కి స్థూల వేతనంగా రూ.6.31 కోట్లు అందుకున్నారు. 2018-19లో ఆయన రూ.4.90 కోట్లు పొందారు.
  • యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ ఛౌధ్రికి రూ.6.01 కోట్లు లభించాయి.
  • కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ స్థూల వేతనం రూ.2.97 కోట్లుగా నమోదైంది. 2018-19లో ఆయనకు రూ.3.52 కోట్లు లభించాయి.

ఇదీ చదవండి: ఐఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ అదిరే ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.