ETV Bharat / business

Warren Buffett: 'కోకా కోలా'కు యజమాని ఈయనేనా?

వారెన్ బఫెట్​ (Warren Buffett).. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. పెట్టుబడులతో వ్యాపార వర్గాన్ని.. దాతృత్వంతో సామాన్య ప్రజానికానికి ఆయన అందరికీ సుపరిచితులు. సోమవారం (ఆగస్టు 30) ఆయన 91వ పుట్టిన రోజు (warren buffett birthday). ఆయన గురించి కొన్ని ఆసక్తికకరమైన విషయాలు మీ కోసం.

Warren Buffett
వారెన్ బఫెట్​
author img

By

Published : Aug 30, 2021, 1:06 PM IST

పెట్టుబడి, వ్యాపార వర్గాల్లో ఆయనంటే లియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనే వారెన్ బఫెట్ (Warren Buffett)​. సోమవారం (ఆగస్టు 30) ఆయన పుట్టిన రోజు(Warren Buffett birthday). ఈ సందర్భంగా బఫెట్​ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Warren Buffett Interesting facts) ఇప్పుడు తెలుసుకుందాం.

  • వారెన్ బఫెట్​ 1930 ఆగస్టు 30న జన్మించారు. సోమవారం ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు.
  • 1936లో అంటే ఆయనకు ఆరేళ్ల వయసున్నప్పుడు చూయింగ్​ గమ్​ ప్యాకెట్స్​, కోకో కోలా బాటిల్స్​ అమ్మడం, మ్యాగజైన్​లు వేయడం వంటి పనులు చేసి డబ్బులు సంపాదించే వారు.
  • ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి. అలా పెట్టుబడులకు సంబంధించిన పుస్తకాలు చదివి.. చిన్నప్పుడే తన గమ్యాన్ని నిర్ణయించుకున్నారు.
  • 11 ఏళ్ల వయస్సులో తొలిసారి స్టాక్​ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు బఫెట్​. అయితే.. అప్పటికే చాలా ఆలస్యం చేశానని ఇప్పటికే చెబుతుంటారు.
  • అమెరికాకు చెందిన ప్రఖ్యాత బహుళజాతి సంస్థ బెర్క్​షైర్ హాత్​వే ఛైర్మన్​, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
  • బెర్క్​షైర్ హాత్​వేకు యాపిల్​, బ్యాంక్ ఆఫ్​ అమెరికా, కోకా కోలా, అమెరికన్ ఎక్స్​ప్రెస్​ వంటి దిగ్గజ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.
  • శీతల పానీయాల సంస్థ కోకా కోలా వారెన్​దే అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఆ సంస్థకు ఓనర్ అంటూ ఎవరూ లేరు. వేలాది మంది పెట్టుబడిదారులే ఈ కంపెనీకి యజమానులు. అయితే ఈ కంపెనీలో అత్యధిక వాటా ఉన్న వ్యక్తి (9.3 శాతం) వారెన్ బఫెట్​.
  • బ్లూమ్​బర్గ్​ ఇండెక్స్​ ప్రకారం ప్రస్తుతం బఫెట్ సంపద 104 బిలియన్​ డాలర్లు
  • బఫెట్​ సంపదలో 90 శాతానికిపైగా ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాత సంపాదించిందే.
  • సంపాదించడంలోనే కాదు.. దాతృత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. బెర్క్​షైర్ హాత్​వేలో ఆయనకున్న సంపదలో 85 శాతం ఛారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు.
  • హార్వర్డ్​ యూనివర్సిటీలో చదువుకునేందుకు వారెన్​ బఫెట్​ దరఖాస్తు చేసుకోగా.. దానిని ఆ యూనివర్సిటీ తిరస్కరించింది.
  • 1958 నుంచి ఇప్పటి వరకు.. ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నారు.
  • ఆయనతో ఒక్క పూట కలిసి భోజనం చేసేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తుంటారు చాలా మంది.
  • తన ఆస్తిలో ఎక్కువ భాగం తన పిల్లలకు ఇవ్వడంలో అర్థం లేదని అభిప్రాయపడుతుంటారు బఫెట్. తెలివైన తండ్రి ఎప్పుడు ఆస్తి మొత్తాన్ని పిల్లలకు ఇవ్వడని చెబుతుంటారు. పిల్లల్లో కేవలం తాము ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాశాన్ని పెంపొందించాలని సూచిస్తుంటారు.
  • సుదీర్ఘ కాలం పాటు వాడిన శాంసంగ్​ ఫ్లిప్​ ఫోన్​ను​ పక్కన పెట్టి.. 2020లో యాపిల్​ ఐఫోన్​ 11ను కొనుగోలు చేశారు బఫెట్​. యాపిల్​ కంపెనీలో బఫెట్​కు దాదాపు 5.6 శాతం వాటా ఉంది. దీని విలువ 70 బిలియన్ డాలర్ల పైమాటే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.