ETV Bharat / business

GOLD HALL MARK: బంగారం కొంటున్నారా..! అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.. - telangana top news

బంగారం కొనాలనుకుంటున్నారా..! అయితే మీరు కొనే నగలపై హాల్ మార్కింగ్ ఉందో లేదో చూస్కోండి. హాల్ మార్కింగ్ ఉంటేనే అవి ఎంత స్వచ్ఛమైనవో తెలుస్తాయి. అసలిదంతా ఏంటి.. హాల్ మార్క్ ఎంటి, వాటిని ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా..! అయితే ఈ కథనం చదివేయండి.

hall-mark-importance-in-gold-jewellery
బంగారం కొంటున్నారా..! అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
author img

By

Published : Aug 26, 2021, 8:50 AM IST

డబ్బు తర్వాత మన దేశంలో అందరూ ఎక్కువగా మక్కువ చూపేది బంగారం పైనే... ఇంకా చెప్పాలంటే డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో పసిడి దుకాణాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టే వ్యాపారస్తులు.. డిస్కౌంట్ల ప్రకటనలు ఇస్తూ... మా బంగారం మంచిదని, మేమిచ్చే అన్ని నగలపై హాల్ మార్క్ ఉందంటూ ఊదరగొట్టేస్తారు. అసలు మంచి బంగారం అంటే ఏంటి? అది మంచిదో కాదో ఎలా తెలుసుకోవాలి? హాల్ మార్కింగ్ ఏ ప్రాతిపదికన వేస్తారు... ఇలాంటి అంశాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా బంగారం కొంటే ఇక అంతే సంగతులు.

బంగారం కొంటున్నారా..! అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

బంగారం స్వచ్ఛతను ఎలా నిర్ధారిస్తారు?

హాల్​మార్క్ సెంటర్​లో మొదట వ్యాపారులు తెచ్చిన బంగారు ఆభరణంలోని చిన్న ముక్కను వేరు చేస్తారు. తర్వాత దాన్ని మెల్టింగ్ విధానంలో 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి.. వివిధ పద్ధతుల్లో బంగారంలోని ఇతర ఖనిజాలను వేరుచేస్తారు. దాన్నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని తీసి పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆభరణాన్ని కంప్యూటర్ ద్వారా పరీక్షించినప్పుడు బంగారం యొక్క స్వచ్ఛత దానిలో వాడబడిన ఖనిజాల శాతం తెలియజేస్తూ... ఒక పట్టిక వస్తుంది. అందులో బంగారం శాతం 91.6 వచ్చినట్లయితే అది 22 క్యారెట్ల బంగారంగా నిర్ధారిస్తారు. ఈ రెండు విధానాలలో బంగారం స్వచ్ఛతను బేరీజు వేసుకున్న తర్వాత ఆన్​లైన్​లో షాపు యజమాని పేరు, తదితర వివరాలు నమోదు చేసుకొని లేజర్ మిషన్ ద్వారా ఆ బంగారు ఆభరణంపై కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన గుర్తును హాల్ మార్క్​గా వేస్తారు. బంగారం శాతం 91.6 కన్నా తక్కువ వస్తే హాల్ మార్కింగ్ వేయరు. దీనివల్ల బంగారం కొన్న ప్రతి ఒక్క వినియోగదారుడు తమ బంగారం యొక్క స్వచ్ఛతను తెలుసుకునే వీలు ఉంటుంది.

హాల్ మార్క్ సెంటర్​లో సిల్వర్ ఎంత కలిసింది, కాపర్, జింక్ లాంటివి ఎంత కలిసినయో మేము టెస్ట్ చేసి చెప్తం. అలాగే రిపోర్ట్ ఇచ్చి హాల్ మార్క్ వేస్తం. ఇప్పుడు కొత్త సిస్టం వచ్చింది. అంటే హెచ్​యూఐడీ. ఆన్​లైన్. సాంప్లింగ్ తీసుకొని అందులో ఏది ఎంత పర్సెంటేజ్​లో ఉందో చూస్తాం. 916 ఉంటే దాని మీద గవర్నమెంట్ అలాట్ చేసిన హెచ్​యూఐడీ 6 డిజిట్స్ నంబర్ వేస్తాం. అది ఎక్కడు చూసినా ఎవరు వేసిర్రు.. అందులో స్వచ్ఛత ఎంతుందనదే మనకు తెలిసిపోతుందన్నమాట.

- పద్మగౌడ్, క్వాలిటీ మేనేజర్

మంచి బంగారం అంటే ఏంటి.. ఎలా ఉంటుంది?

బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే పూర్తి స్వచ్ఛమైనదని అర్థం. కానీ ఇది చాలా మెత్తగా ఉంటుంది. అందుకే 24 క్యారెట్ బంగారాన్ని ఆభరణాలకు ఉపయోగించరు. 22 క్యారెట్ల బంగారానే వాడుతుంటారు. 22 క్యారెట్ బంగారంలో... 91.6 శాతం బంగారం.. జింక్, కాపర్, వెండి వంటి ఖనిజాలుంటాయి. బంగారంలో ఇతర ఖనిజాలు వాడటం వల్ల అవి మరింత దృఢంగా, మన్నికగా ఉంటాయి. బంగారం శాతాన్ని బట్టి బంగారు ఆభరణాల రంగు ఆధారపడి ఉంటుంది. హాల్ మార్కింగ్ లేకుండా విక్రయించే బంగారంలో 18 క్యారెట్లకు మించి బంగారం ఉండదని అంచనా. దీంతో ఈ తరహా ఆభరణాలలో వర్తకులకు ఎక్కువగా లాభం ఉంటుంది.

హాల్ మార్కింగ్ ఎవరు వేస్తారు?

ఏదైనా విలువైన లోహంతో తయారు చేసే వస్తువులలో లోహం ఎంత ఉందో ఖచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ముద్రవేయడమే హాల్ మార్కింగ్. ఇది చాలా దేశాల్లో విలువైన వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. ఈ వస్తువుల కల్తీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం... వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలు పాటించేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) హాల్ మార్క్ అన్ని బంగారు దుకాణాలకు లైసెన్స్ ఇస్తుంది. ఈ లైసెన్స్ పొందిన జ్యువెల్లరీ యజమానులు హాల్​మార్క్ వేయవచ్చు. హాల్​మార్క్ లేకుండా ఒక్క బంగారు అభరణం అమ్మినా అది నేరమే.

కస్టమర్​లు బంగారు ఆభరణాలపై మోసపోకుండా మనకు కరెక్టు ఉందా లేదా అన్నది బయటపడుతుందన్నమాట. ఆ నంబరు చూసి మనమెక్కడకు పోయినా మన వస్తువు పర్​ఫెక్ట్ హా కాదా అనే విషయం తెలిసిపోతుంది. ప్రతీ ఒక్క కస్టమర్ తన వస్తువులపై పెట్టిన పెట్టుబడి మళ్లీ తిరిగొచ్చేటట్టు ఈ విధానం రూపొందించడం జరిగింది. - పద్మగౌడ్, క్వాలిటీ మేనేజర్

హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

భారత ప్రభుత్వం 2021 జూన్ 15 నుంచి... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బంగారు దుకాణాల వ్యాపారులు హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాలను మాత్రమే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే వర్తకులు విక్రయించాలి. ఇష్టమొచ్చినట్లు క్యారెట్లు నిర్ణయించడం కూడా నేరమే అవుతుందని తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయించే బంగారంలో... కేవలం 40 శాతం మాత్రమే హాల్ మార్కింగ్ తో విక్రయాలు చేపడుతున్నాయి. ప్రపంచ బంగారు మండలి ప్రకారం భారతదేశంలో సుమారు 4 లక్షల మందిలో 35 వేల 879 మాత్రమే ప్రస్తుతం బీఐఎస్ సర్టిఫికెట్ పొందారు. కానీ హాల్ మార్కింగ్ లైసెన్స్ తీసుకోవడం ఆర్థికంగా భారం అవుతుందని... చిరు వ్యాపారులు చెబుతున్నారు.

చిన్న వర్కులు చేసుకునేటువంటి వర్కర్స్​కి హాల్​మార్క్ నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటది. 40 లక్షల టర్నోవర్ కంటే తక్కువ చేసేవాళ్లకు మినహాయిస్తే బాగుంటది. ఆపైన చేసుకునేవారికి హాల్ మార్క్ చేపియ్యమని.. మాకు కాస్త సడలింపు ఇవ్వాలని కోరుకుంటున్నం.

- బ్రహ్మచారి, వ్యాపారస్తుడు

మార్కింగ్ లేకుండా అమ్మే బంగారంలో కేవలం 60 నుంచి 70 శాతం మాత్రమే బంగారం ఉంటుందని.. దానివల్ల కొనుగోలుదారులు మోసపోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం ప్రజలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. కొనుగోలుదారులు హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుక్కోవాలని.. తక్కువ ధరకు వస్తుంది, డిస్కౌంట్ వస్తుందంటూ హాల్ మార్క్ లేని బంగారాన్ని కొని మోసపోవద్దని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: TECHNICAL SKILLS: అమ్మాయిలూ ఈ విషయంలో మీరస్సలే వెనకబడొద్దు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.