ETV Bharat / business

నకిలీ జీఎస్​టీ బిల్లుల కేసులో 700 కోట్లు జప్తు! - నకిలీ జీఎస్​టీ బిల్లుల కేసులో స్వాధీనం చేసుకున్న నగదు

నకిలీ జీఎస్​టీ ఇన్​వాయిస్​ల కేసుల్లో.. ఇప్పటి వరకు 215 మందిని అరెస్టు చేశారు జీఎస్​టీ ఇంటెలిజెన్స్​ అధికారులు. ఇందులో ఆరుగురు ఛార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ), ముగ్గురు సీఈఓలు, 36 మంది ఎండీలు, డైరెక్టర్లు, 15 మంది పార్ట​నర్లు, 81 మంది ప్రొప్రైటర్​లు సహా ఇతరులు ఉన్నారు. ఈ అంశంపై 'ఈటీవీ భారత్​' పరిశీలనలో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Cash recovered from fake GST invoices case
బోగస్ జీఎస్​టీ ఇన్​వాయిస్​ల కేసుల్లో 215 మంది అరెస్టు
author img

By

Published : Jan 11, 2021, 12:49 PM IST

దేశవ్యాప్తంగా భారీ ఎత్తున బయటపడిన నకిలీ జీఎస్​టీ ఇన్​వాయిస్​ల కేసుల్లో.. ఇప్పటి వరకు 215 మందిని అరెస్టు చేశారు జీఎస్​టీ ఇంటెలిజెన్స్ అధికారులు. మొత్తం 2,200 కేసులు నమోదయ్యాయి. మోసాలకు పాల్పడిన వారి నుంచి గత రెండు నెలల్లో రూ.700 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు 'ఈటీవీ భారత్​' పరిశీలనలో తెలిసింది.

జీఎస్​టీ అధికారులు అరెస్ట్​ చేసిన వారిలో.. ఆరుగురు ఛార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ), ముగ్గురు సీఈఓలు, 36 మంది ఎండీలు, డైరెక్టర్లు, 15 మంది పార్టనర్లు, 81 మంది ప్రొప్రైటర్​లు సహా ఇతరులు ఉన్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా నకిలీ జీఎస్​టీ బిల్లులను సృష్టించి.. అక్రమంగా ఇన్​పుట్ ట్యాక్స్​ క్రెడిట్​ను క్లెయిమ్​ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 6,600 జీఎస్​టీ నంబర్లను రద్దు చేశారు.

బోగస్ జీఎస్​టీ డీలర్లతో పాటు.. నకిలీ బిల్లులతో లబ్ధిపొందిన తుది వ్యక్తి వరకు అరెస్టయిన వారిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

'బీఏఎఫ్​టీఏ టూల్స్​తో పాటు డేటా అనలటిక్స్, డేటా షేరింగ్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి.. నకిలీ సంస్థల కార్యకలాపాలను గుర్తించాం' అని అధికారులు 'ఈటీవీ భారత్​'కు వివరించారు.

సూత్రధారుల్లో ఎమ్మెల్యే కుమారుడు..

జీఎస్​టీ మోసాలకు సంబంధించి 70 మందికిపైగా సూత్రధారులనూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేసి మోసానికి పాల్పడిన చెన్నైకి చెందిన మహిళ సహా.. మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు.

ముంబయిదే అగ్రస్థానం..

నకిలీ జీఎస్​టీ ఇన్​వాయిస్​ల కేసులో ముంబయి జోన్​లోనే అత్యధికంగా 23 మంది అరెస్టయినట్లు అధికారులు తెలిపారు. 14 మందితో అహ్మదాబాద్​ జోన్​ రెండో స్థానంలో ఉంది.

మోసాలకు పాల్పడ్డ కంపెనీల్లో ఎక్కువ మొత్తం గార్మెంట్స్​, కాపర్​ స్క్రాప్​, ఔషధాలు, ఐరన్​ స్క్రాప్​, సిమెంట్, బొగ్గు వంటి వ్యాపారాలకు సంబంధించినవని గుర్తించారు అధికారులు.

ఇదీ చూడండి:మొండిబాకీలతో బ్యాంకులకు బేజారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.