ETV Bharat / business

జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

జీఎస్టీ అమలు వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు.. రెండు మార్గాలు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే బిహార్​ మాత్రం కేంద్రం నిర్ణయం వైపే మొగ్గుచూపుతోంది.

GST Dues: Is Bihar dividing the unity of States in GST Council
జీఎస్టీ పరిహారంపై అన్ని రాష్ట్రాలు ఒకవైపు.. బిహార్​ మరోవైపు!
author img

By

Published : Aug 28, 2020, 3:37 PM IST

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆఫర్లపై అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిహార్​ మాత్రం కేంద్రం నిర్ణయానికే ఓటు వేస్తోంది.

కరోనాతో నెలకొన్న పరిస్థితులతో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు.. జీఎస్టీ పరిహారం చెల్లించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం దిల్లీలో 41వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

జీఎస్టీ సమావేశంలో నిర్ణయాలివే...

ఈ సమావేశంలో మాట్లాడిన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అందులో రూ.65 వేల కోట్లు మాత్రమే సెస్​ ద్వారా వచ్చే అవకాశం ఉందన్నారు.

"కేంద్రమే రుణం తీసుకొని జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించాలని కొన్ని రాష్ట్రాలు తొలుత కోరాయి. అయితే ప్రస్తుతం ఉన్న లోటు పరిస్థితుల గురించి వారితో చర్చించాం. ఆ తర్వాత రాష్ట్రాలకు రెండు ఆప్షన్లను ఇచ్చాం. రెండింటిలోనూ రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవాలనే చెప్పాం. కేంద్రమే అప్పు తెచ్చి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్​ చేశాయి. కేంద్రం కాకుండా రాష్ట్రాలు రుణాలు తీసుకోవడం ఎందుకు మంచిదో వారికి వివరించాము. రాష్ట్రాలు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆర్బీఐ ద్వారా ఆ ప్రక్రియను సులభతరం చేస్తాం."

-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు అంశంపై రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందు ఉంచారు నిర్మల.

1. జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన లోటు రూ.97 వేల కోట్లను ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం.

2. సంవత్సరం మొత్తం ఏర్పడే రూ.2.35లక్షల కోట్ల లోటును ప్రత్యేక ఏర్పాటు ద్వారా ఆర్బీఐ నుంచి రుణం పొందడం.

ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాలు ఏడు రోజుల్లో అభిప్రాయం తెలపాలని సూచించారు. అయితే ఈ మొత్తంలో.. జీఎస్టీ వల్ల రూ.97 వేల కోట్లు, మిగతాది కొవిడ్‌ ప్రభావం వల్ల వచ్చిన లోటుగా స్పష్టం చేశారు నిర్మల.

కేంద్రమే అప్పు తేవాలి...

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన రెండు ఎంపికలపై.. పలు భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఆగ్రహించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ద్వారా ఎందుకు సమీకరించుకోవాలని ప్రశ్నించాయి. కేంద్రమే అప్పు తెచ్చి న్యాయబద్ధంగా వాటిని తమకు చెల్లించాలని పట్టుబట్టాయి. అయితే బిహార్​ మాత్రం కేంద్రం చెప్పినట్లు ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

"ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బిహార్​ అప్పు తీసుకునేందుకు అంగీకరించింది. మిగతా రాష్ట్రాలు మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి" అని జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు.

జీఎస్టీ చట్టం ప్రకారం...

2017 జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) చట్టం ప్రకారం.. ఐదేళ్ల కాలంలో రాష్ట్రాల ఆదాయ సేకరణలో నష్టం ఏర్పడితే ఆ పరిహారం కేంద్రం చెల్లించాలి. రాష్ట్రాల ఆదాయ సేకరణలో ఏదైనా కొరత ఏర్పడితే సిన్​ వస్తువులు, ఇతర లగ్జరీ వస్తువులపై వేసిన జీఎస్టీ పరిహార సెస్​ ద్వారా ఆ మొత్తాన్ని కేంద్రం సమకూర్చాలి. భారత ఏకీకృత నిధి నుంచి మాత్రం రాష్ట్రాలకు ఆ పరిహారం చెల్లించరు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో జీఎస్టీ పరిహారం బకాయిలు మొత్తం రూ .1.5 లక్షల కోట్లు. ఇప్పటివరకు కేంద్రం జీఎస్టీ పరిహార బకాయిలను ప్రతి రెండు నెలలకు చెల్లించేది. అయితే ప్రస్తుతం లోటు కారణంగా చెల్లించలేదు. ఈ ఏడాది పరిహారం మొత్తం రూ.3 లక్షల కోట్లకు చేరుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే తెలిపారు. కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లపై 7 రోజులు గడువు ముగిశాక.. మినీ జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం ఉంటుందని ఆయనం స్పష్టం చేశారు.

-- కృష్ణానంద్​ త్రిపాఠీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.