ETV Bharat / business

వాడీవేడిగా జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం - జీఎస్టీ కౌన్సిల్ న్యూస్​

జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశంపై వివాదం నెలకొన్న వేళ సోమవారం జరిగే జీఎస్టీ మండలి సమావేశం వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రాలకు అందించే పరిహారంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

gst-council-meet-likely-on-monday-non-bjp-states-to-oppose-centres-borrowing-option
వాడీవేడిగా జరగనున్న 42వ జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం
author img

By

Published : Oct 5, 2020, 4:45 AM IST

Updated : Oct 5, 2020, 6:30 AM IST

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సోమవారం సమావేశం కానుంది. అయితే.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంపై కేంద్ర ప్రభుత్వంతో భాజపాయేతర రాష్ట్రాలు విభేదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం వాడీవేడిగా సాగనుంది.

దేశంలోని భాజపా పాలిత 21 రాష్ట్రాలు.. పరిహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయ లోటును తీర్చుకునేందుకు రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు సమ్మతించాయి. కానీ, బంగాల్​, పంజాబ్​, కేరళ వంటి భాజపాయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్రాలు అందుకు అంగీకరించటం లేదు.

సోమవారం జరిగే 42వ జీఎస్టీ మండలి సమావేశంలో విపక్షాల నేతృత్వంలోని రాష్ట్రాలు.. కేంద్రం ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని డిమాండ్​ చేయొచ్చని పేర్కొన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు రూ.2.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయ లోటును ఎదుర్కొంటున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ.97వేల కోట్లు జీఎస్టీ అమలు వల్ల లోటుగా పరిగణించగా.. మిగతా రూ.1.38 లక్షల కోట్లు కరోనా మహమ్మారి ప్రభావంతో నష్టపోయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం రెండు ప్రతిపాదనలు చేసింది. ఆర్బీఐ కల్పించే ప్రత్యేక విండో ద్వారా రూ.97 వేల కోట్లను రుణంగా తీసుకోవటం లేదా.. మొత్తం రూ.2.35 కోట్లను మార్కెట్​ నుంచి సేకరించుకోవచ్చని సూచించింది.

Last Updated : Oct 5, 2020, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.