ETV Bharat / business

నవంబర్​లోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు

GST Collection in November : జీఎస్​టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. నవంబర్​​లోనూ రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 నవంబర్​తో పోలిస్తే.. గత నెల జీఎస్​టీ ఆదాయం 25 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST Collection
జీఎస్​టీ వసూళ్లు
author img

By

Published : Dec 1, 2021, 1:50 PM IST

GST Collection in November: వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు నవంబర్​​లోనూ రూ.లక్ష కోట్ల మార్క్​ దాటాయి. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,31,526 కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. గత ఏడాది నవంబర్​తో పోల్చితే ఈ మొత్తం 25 శాతం ఎక్కువని పేర్కొంది

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ: రూ.23,978 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ: రూ.31,127 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ: రూ.66,815 కోట్లు
  • సెస్​: రూ.9,606 కోట్లు

జీఎస్​టీ ప్రవేశపెట్టిన నాటి నుంచి గత నెల వసూళ్లు రెండో అత్యధికం అని అధికారులు తెలిపారు. ఇదే ఏడాది ఏప్రిల్​లో రికార్డ్​ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకోవడం కారణంగా భారీ స్థాయిలో జీఎస్​టీ వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: LPG Cylinder Price: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.