క్రితం భేటీలో తగ్గింపు...
ఫిబ్రవరి 24న జరిగిన భేటీలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 5 శాతానికి, అందుబాటు ధరలోని ఇళ్లపై పన్నును 1 శాతానికి తగ్గించింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ముడిసరుకు, సేవల విషయంలో పన్ను సబ్సిడీ పొందేందుకు నిర్ణయాత్మక గడువుకు సంబంధించిన నిబంధనలకూ ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 ముందు ఇంటి కొనుగోలు ప్రారంభమై, కొత్త పన్ను అమల్లోకి వచ్చాక ముగిసే వాటి విషయంలో పన్ను సబ్సిడీ వివరాలు చర్చించనున్నారు.
ప్రస్తుత పన్ను స్థాయి...
ప్రస్తుతం అందుబాటులోని ధరల ఇళ్లపై 8 శాతం జీఎస్టీ ఉంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయినట్లు ధ్రువీకరించకుండా ఆక్రమించుకోవటానికి సిద్ధంగా(రెడీ టూ ఆక్యూపై) ఉన్న ఇళ్లపై 12 శాతం పన్ను ఉంది. దీనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌలభ్యం ఉంది.
తగ్గిన జీఎస్టీ వసూళ్లు...
జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరిలో రూ. 97, 247 కోట్లకు తగ్గిపోయాయి. ఇది జనవరిలో రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో సీజీఎస్టీ రూ. 17,626 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 24,192 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 46,953 కోట్లు, సెస్ రూ. 8,476 కోట్లుగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 10.70 లక్షల కోట్లు. బడ్జెట్లో 2018-19 సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లను రూ.13.71 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. దీనిని సవరించిన అంచనాల్లో రూ.11.47 లక్షల కోట్లకు తగ్గించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ లక్ష్యం రూ. 13.71 లక్షల కోట్లు.