20ఏళ్ల పాటు డీటీహెచ్ ఆపరేటర్ల లైసెన్సులు తిరిగి పొడిగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా స్కై. ఈ నిర్ణయం డీటీహెచ్ పరిశ్రమకు మరింత చేయూతనందించే విధంగా ఉందని అభిప్రాయపడింది.
దేశంలో డీటీహెచ్ సేవలను అందించేందుకుగా రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోన్న పలు కంపెనీలకు 20 ఏళ్ల పాటు లైసెన్సులను పొడిగించున్నారు. ఇప్పటివరకు అది పది సంవత్సరాల వరకు మాత్రమే ఉండేది.
"ముందుగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్క కృతజ్ఞతలు. డీటీహెచ్ లైసెన్స్ విధానంలో దీర్ఘకాలంగా ఉన్న ప్రతిష్టంభనకు తెరదించారు. ఈ నిర్ణయంతో డీటీహెచ్ రంగంలో ఉన్న కంపెనీలు లాభపడనున్నాయి."
-హరిత్ నాగ్‌పాల్, టాటా స్కై మేనేజింగ్ డైరెక్టర్
ఇదీ చూడండి: అత్యధిక హెచ్డీ ఛానల్స్ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే!