ETV Bharat / business

ఆ ఎయిర్​పోర్టుల్లో మిగిలిన ప్రభుత్వ వాటా అమ్మకం! - ప్రైవేటైజేషన్

దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి ఉన్న మిగిలిన 26 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి త్వరలో మంత్రివర్గం పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. దీంతో పాటు 2021-22వ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ కోసం మరో 13 విమానాశ్రయాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.

Govt to sell remaining stake in Delhi, Mumbai, B'lore, Hyderabad airports
ఆ ఎయిర్​పోర్టుల్లో మిగిలిన ప్రభుత్వ వాటా అమ్మకం!
author img

By

Published : Mar 14, 2021, 12:01 PM IST

ప్రైవేటుపరం చేసిన దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ విమానాశ్రయాల్లో అట్టిపెట్టుకున్న ప్రభుత్వ వాటాను కూడా పూర్తిగా అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వనరులను నిధులుగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నాలుగు విమానాశ్రయాల్లో భారత విమానాశ్రయ అథారిటీ(ఏఏఐ) వాటాను విక్రయించనుంది కేంద్రం. ఈ విమానాశ్రయాల్లో ఏఏఐకి 26 శాతం వాటా ఉంది. త్వరలో ఈ విక్రయానికి సంబంధించి మంత్రిమండలి కూడా ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. దీంతో పాటు 2021-22వ ఆర్థిక సంవత్సరంలో బేరానికి పెట్టేందుకు మరో 13 విమానాశ్రయాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.

తొలి దశలో..

విమానాశ్రయాల తొలిదశ ప్రైవేటీకరణలో భాగంగా గతేడాది అదానీ సంస్థలు.. లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, జైపుర్​, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను దక్కించుకున్నాయి. పౌర విమానయాన శాఖ పరిధిలోని ఏఏఐ అధీనంలో.. దాదాపు 100 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని నిధులుగా మార్చాలని నరేంద్రమోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: 'నౌక, విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాను అమ్మబోం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.