దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఉల్లి ఎగుమతులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ఈ నెల 15 నుంచి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు దోహదపడుతుందని ట్విట్టర్‌లో తెలిపారాయన.
ఎగుమతి నిర్ణయం దేశీయంగా ఉల్లి ధరల తగ్గుదలను నిలుపుదల చేస్తుందనిని కేంద్రం భావిస్తోంది. ఈ నెలాఖరు కల్లా 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని కేంద్రం భావిస్తోంది. గతేడాది ఇదే నెలలో 28.4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది.
గతేడాది సెప్టెంబర్‌లో మహరాష్ట్రలో అకాల వర్షాలు, వరదల కారణంగా ఖరీఫ్ పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు డిమాండ్, సరఫరాల్లో తేడాల కారణంగా ఉల్లి సెగ రేపింది. ప్రస్తుతం రబీ పంట దిగుబడితో ఉల్లి ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి.
ఇదీ చూడండి: ఎస్బీఐ కార్డ్ ఐపీఓ: తొలిరోజే 39 శాతం వాటాలకు బిడ్లు