వాహనాల నంబర్ ప్లేట్ల రంగు సహా ఇతర అన్ని రకాల అనుమానాలపై మరోసారి కేంద్రం స్పష్టతనిచ్చింది. దీనిపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
- బ్యాటరీతో నడిచే వాహనాలకు ఆకుపచ్చ రంగు బ్యాగ్రౌండ్‌తో ఆల్ఫా న్యూమరల్స్ ఉన్న నంబర్ ప్లేటును అమర్చాలి.
- తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం.. ఎరుపు రంగు ఆల్ఫా న్యూమరల్స్, పసుపు రంగు బ్యాగ్రౌండ్ నంబర్ ప్లేట్లను కేటాయించింది.
- డీలర్ల అధీనంలో ఉంటే వాహనాల నంబర్ ప్లేట్లు ఎరుపు రంగులో ఉండాలని సూచించింది. దానిపై తెలుపు రంగు అల్ఫా న్యూమరల్స్ ఉండాలని పేర్కొంది.
నంబర్ ప్లేట్ కేటాయింపు విధానంపై స్పష్టత కోసం మాత్రమే.. ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. కొత్తగా మర్పులేవీ లేవని స్పష్టం చేసింది.
గతంలో ప్రకటన..
ఇంతకు ముందు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రకరకాల వాహనాల నంబర్ ప్లేట్ల విధానాలను సూచించింది కేంద్రం. ఆ తర్వాత వివిధ క్యాటగిరీ వాహనాలకు నంబర్ ప్లేట్ ఆల్ఫా న్యూమరల్స్, బ్యాంగ్రౌండ్లను నిర్ధేశించింది.
ఇదీ చూడండి:ధీమా ఇచ్చే బీమా రంగంపై కరోనా కాటు!