ETV Bharat / business

గ్రామీణ బ్యాంకులకు కేంద్రం పెట్టుబడి సాయం - Rs 670-cr support

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు పెట్టుబడి సాయం కింద రూ. 670 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. రీక్యాపిటలైజేషన్ పథకం కింద ఈ సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. దీంతో మూలధన, రిస్క్​ వెయిటెడ్ యావరేజీ(సీఆర్ఏఆర్) మధ్య నిష్పత్తి ఆర్​బీఐ నిర్దేశించిన 9 శాతానికి పెరగనుంది.

Govt provides Rs 670-cr support to Regional Rural Banks to meet regulatory capital
ఆర్​ఆర్​బీలకు కేంద్రం రూ. 670 కోట్ల పెట్టుబడి సాయం
author img

By

Published : Nov 1, 2020, 2:36 PM IST

నష్టాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్​బీ)లకు ఆసరా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 670 కోట్లు మంజూరు చేసింది. పెట్టుబడి సహాయం కింద ఈ నిధులు అందించింది.

మొత్తం 43 ఆర్​ఆర్​బీలలో మూడింట ఒక వంతు బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకులే అధికంగా నష్టపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. 9 శాతం రెగ్యులేటరీ క్యాపిటల్​ కోసం నిధులు అవసరమని తెలిపారు.

ఆర్​ఆర్​బీల రీక్యాపిటలైజేషన్​ పథకం కింద కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్యాంకులకు పెట్టుబడి సహకారం అందించనున్నాయి. 50:15:35 నిష్పత్తిలో ఈ నిధులు సమకూర్చనున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉండగా, 35 శాతం ప్రాయోజిత బ్యాంకులకు, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంది. ఈ మేరకు నిధులను స్పాన్సర్ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మూలధన, రిస్క్​ వెయిటెడ్ యావరేజీ(సీఆర్ఏఆర్) మధ్య నిష్పత్తి ఆర్​బీఐ నిర్దేశించిన 9 శాతానికి పెరుగుతుందని చెప్పారు.

నష్టాల్లో ఆర్ఆర్​బీలు

నాబార్డు గణాంకాల ప్రకారం మొత్తం ఆర్​ఆర్​బీలు కలిపి 2020 మార్చి 31 నాటికి రూ. 2,206 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 652 కోట్లుగా ఉంది.

2020 ఆర్థిక సంవత్సరంలో 17 ఆర్​ఆర్​బీల సీఆర్ఏఆర్ విలువ 9 శాతం కన్నా తక్కువ ఉంది. అందులో ఆరు బ్యాంకుల సీఆర్ఏఆర్ ప్రతికూలంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.