ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో కేంద్రం మరోసారి భారీ ఉద్దీపనలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ ఉద్దీపనలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందని.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలోనే వాటిని ప్రకటిస్తారని ఓ అధికారి పేర్కొన్నారు. అయితే ఈసారి ఏ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారనే విషయాన్ని ఆ అధికారి వెల్లడించలేదు.
స్థిరాస్తి, ఎగుమతి రంగాలకు ప్రోత్సాహకాలు.. బ్యాంకుల విలీనం సహా సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాహన రంగానికి రాయితీల అందించే ఉద్దీపనలు ఇటీవలే ప్రకటించింది కేంద్రం. త్వరలో ప్రకటించే ప్రోత్సాహకాలపై భారీ అంచనాలున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇదే నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 37వ సమావేశం జరగనుంది. ఇందులో వాహనరంగానికి ప్రోత్సాహమందించేందుకు గాను జీఎస్టీ కోత, ఎఫ్ఎంసీజీ రంగానకి భారీగా ప్రోత్సాహకాలు అందించొచ్చని అంచనాలున్నాయి. ఈ వారంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులతో నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్కు 'ఐబీసీ-నూతన ఆవిష్కరణ' పురస్కారం